Gorre Puranam OTT: పురాణాలందు ఈ 'గొర్రె పురాణం' వేరయా... త్వరలో ఆహాలోకి వస్తుందయా!
Gorre Puranam OTT Platform: సుహాస్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన రీసెంట్ మూవీ ‘గొర్రె పురాణం’ త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది.
Gorre Puranam OTT Release Date: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకువచ్చింది. థియేటర్లలో రిలీజ్ అయిన మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీ అందుబాటులోకి రాబోతోంది. విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించే సుహాస్ ‘గొర్రె పురాణం’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వినిపించినప్పటికీ... వసూళ్ల పరంగా సత్తా చాటలేకపోయింది.
అక్టోబర్ 10 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్..
థియేటర్లలో పెద్దగా ఆడలేకపోయిన ఈ సినిమాను ఆహా త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ‘గొర్రె పురాణం’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. అక్టోబర్ 10 నుంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. “పురాణాలందు ఈ 'గొర్రె పురాణం' వేరయా! అక్టోబరు 10 న ఆహాలో వస్తుందయా!!” అంటూ ఇంట్రెస్టింగ్ కాప్షన్ పెట్టింది. థియేటర్లలో ఈ సినిమా చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూసేందుకు రెడీ అవుతున్నారు.
View this post on Instagram
'గొర్రె పురాణం' కథే ఏంటంటే?
ఈ సినిమా కథ అంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది. ఓ ముస్లీం యువకుడు బక్రీద్ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేస్తాడు. ఇంటికి తీసుకొని వస్తాడు. పండుగ రోజు దాన్ని నరికేందుకు ప్రయత్నించగా తప్పించుకుని పారిపోతుంది. నేరుగా ఆ గొర్రె అమ్మవారి ఆలయంలోకి వెళ్తుంది. అక్కడున్న భక్తులు అమ్మవారే ఈ గొర్రెను బలి ఇవ్వమని పంపించిందంటూ దాన్ని పట్టుకుని నేవైథ్యంగా పెట్టాలని భావిస్తారు. ఈ గొర్రె మాదంటే మాదంటూ ఇరు వర్గాలు గొడవపడుతాయి. ఓ కుర్రాడు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో రాష్ట వ్యాప్తంగా సంచలనం అవుతుంది. చివరకు పోలీసులు ఆ గొర్రెను అరెస్టు చేసి కోర్డుకు తీసుకెళ్తారు. ఈ కేసులో న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇస్తారు? ఈ గొర్రె వివాదం వెనుకున్న రాజకీయ కారణాలు ఏంటి? జైల్లో ఖైదీగా ఉన్న రవి (సుహాస్)కి ఈ గొర్రెకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అసలు రవి ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? అతడిని విడిపించేందుకు గొర్రె చేసిన సాయం ఏంటి? అనేది తెలియాలంటే ఆక్టోబర్ 10న ఈ సినిమా ఆహాలో చూడాల్సిందే!
దసరాకు ‘జనక అయితే గనక’ విడుదల
ప్రస్తుతం సుహాస్ వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్నారు. ఆయన హీరోగా నటించిన 'జనక అయితే గనక' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఎటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినమా దసర కానుకగా అక్టోబర్ 12న థియేటర్లలోకి విడుదల కానుంది. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీలో సంగీర్తన హీరోయిన్ గా నటించగా, వెన్నెల కిశోర్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
Read Also: ‘యుఫోరియా’ గ్లింప్స్ వచ్చేసింది- సంథింగ్ డిఫరెంట్ గా గుణశేఖర్ కొత్త మూవీ