Euphoria Glimpse: ‘యుఫోరియా’ గ్లింప్స్ వచ్చేసింది- సంథింగ్ డిఫరెంట్ గా గుణశేఖర్ కొత్త మూవీ
Director Gunasekhar : భూమిక, విఘ్నేష్, లిఖిత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘యుఫోరియా’. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంబంధించిన గ్లింప్స్ ను దిల్ రాజు విడుదల చేశారు.
Euphoria Glimpse Out: వైవిధ్యభరిత సినిమాలను తెరకెక్కించడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గుణ శేఖర్. ఆయన దర్శకత్వంలో ప్రస్తుతం’యుఫోరియా’ అనే సినిమా తెరకెక్కుతోంది. యూత్ ఫుల్ సోషల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భూమిక, నాజర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఆకట్టుకుంటున్న ‘యుఫోరియా’ గ్లింప్స్
‘యుఫోరియా’ సినిమాకు సంబంధించిన సంబంధించిన గ్లింప్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ విడుదల చేశారు. డ్రగ్స్, ఆల్కహాల్ కు బానిసలుగా మారి యువత తమ జీవితాలను ఎలా కోల్పోతున్నారు అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఓ అత్యాచారం కథతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
ట్రెండ్‌కు తగ్గట్టుగా సినిమా ఉంటుంది- దిల్ రాజు
ఈ సందర్భంగా మాట్లాడిన దిల్ రాజు ‘యుఫోరియా’ గ్లింప్స్ పై ప్రశంసలు కురిపించారు. “గుణ శేఖర్ గారు ఎన్నో సక్సెస్‌లు చూశారు. ఫెయిల్యూర్స్ కూడా చూశారు. ఫెయిల్యూర్స్ తరువాత వచ్చే సక్సెస్, ఆ సక్సెస్ ఇచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. యుఫోరియా గ్లింప్స్ అదిరిపోయింది. నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంది. నైట్ లైఫ్, డ్రగ్స్ ఇలా ఇప్పటి తరానికి తగ్గట్టుగా ఉంది. ఈ చిత్రంలో అందరూ కొత్త వాళ్లే నటిస్తున్నారు. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.
యూత్‌కు యూత్‌తో చెప్పాల్సిన కథ- గుణశేఖర్
యూత్‌కు యూత్‌తో చెప్పాల్సిన కథ ‘యుఫోరియా’ అని గుణశేఖర్ అన్నారు. “అంతా కొత్త వారితో ఈ చిత్రం చేశాను. తొంభై శాతం అంతా కొత్త వాళ్లే కనిపిస్తారు. కథను బేస్‌గా చేసుకుని ఈ ఫిల్మ్ చేశాను. ఏడాదిన్నర క్రితం ప్రాజెక్ట్ అనుకున్నాం. ఆరు నెలలు ప్రీ ప్రొడక్షన్ చేశాం. వీళ్లందరినీ ఆడిషన్స్ చేసి.. వర్క్ షాపులు చేసి షూటింగ్‌కు వెళ్లాం. ఇప్పటి వరకు అరవై శాతం షూట్ పూర్తయింది. యుఫోరియా అంటే ఏంటి? అనేది జనాలకు పరిచయం చేయడానికి ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశాం. ఓ రెండు ఘటనలు నన్ను కదిలించాయి. ప్రతీ వారం అలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఇప్పుడున్న టైంలో ఇలాంటి కథను చెప్పాలని అనిపించింది. కథను రాస్తున్న కొద్దీ.. సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే వచ్చాయి.
ఈ కథ అనుకున్న తరువాత నీలిమకు చెప్పాను. ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉందని నా కూతురు చెప్పింది. యూత్‌కు యూత్‌తో చెప్పాల్సిన కథ అని అన్నారు. వాళ్లు కూడా ఇన్ పుట్స్ ఇచ్చారు. పాత్రలకు ఎవరు సూట్ అవుతారో వారినే తీసుకున్నాం. వాళ్లంతా కూడా కథకు కనెక్ట్ అయ్యారు. వారి వారి పాత్రల్లో జీవించేశారు. సినిమాటిక్‌గా కాకుండా అందరూ రియలిస్టిక్‌గా నటించారు. యూత్, పేరెంట్స్ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఇప్పుడున్నయూత్ మైండ్ సెట్‌కు తగ్గట్టుగా సినిమా చాలా కొత్తగా ఉండబోతోంది. మంచి కంటెంట్‌తో వస్తే స్టార్ హీరో ఉన్నాడా? ఏ భాషలో వచ్చింది? అనేది ఆడియెన్స్ చూడటం లేదు. కథ బాగుంటే ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. ఇది చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది”అని అన్నారు.
Read Also: ‘సింగం అగైన్’ ట్రైలర్ రిలీజ్, ‘దేవర’ 10 రోజుల వసూళ్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!