అన్వేషించండి

Ennenno Janmalabandham May 3rd: 'సరిఒడి' భోజనాలు చేసిన యష్ దంపతులు- మాళవికకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వేద

యష్ వేద ఒకరిమీద ప్రేమ మరొకరు బయట పెట్టుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోమని పంతులు చెప్తాడు. తర్వాత యష్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇంత కష్టపడి పూజ చేసినందుకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వమని అడుగుతుంది. ముందే చెప్తే తెచ్చే వాడిని కదా అంటాడు. పైకి ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు కానీ నిజంగా నీమీద ప్రేమ ఉండి చస్తే కదా అని మాళవిక మనసులో తిట్టుకుంటుంది. ఈవినింగ్ లోపల నీకు గిఫ్ట్ తీసుకొచ్చి తెచ్చి ఇస్తాడులే అని మాలిని సర్ది చెప్తుంది. వేద దిగులుగా వెళ్తుంటే యష్ ఆపి తనకి నెక్లెస్ బహుమతిగా ఇస్తాడు. అది చూసి అందరూ సంతోషిస్తారు. చూశావా యష్ కి తన భార్య మీద ఎంత ప్రేమ ఉందోనని మాలిని మురిసిపోతుంది. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే కన్నుల పండుగగా ఉందని శర్మ అంటాడు. మీ చేతులతోనే వేద మెడలో వేయమని సుహాసిని చెప్తుంది.

యష్: అసలైన ఆనందం అంటే నాదే నా జీవితంలో గొప్ప రోజు ఏదైనా ఉందంటే అది పెళ్లి పీటల మీద వేద మెడలో తాళి కట్టిన రోజు. అదే ఆనందం మళ్ళీ గుడిలో తులాభారం రోజు పొందాను. మళ్ళీ ఇప్పుడు అని నెక్లస్ భార్య మెడలో వేస్తాడు. ఖుషి నువ్వు పెద్దయ్యాక మమ్మీలాగా డాక్టర్ అవాలని యశోధర్ కూతుర్ని దీవిస్తాడు. డాడీ నిన్ను బ్లెస్ చేసి గిఫ్ట్ ఇచ్చాడుగా మరి నాకు మీరు గిఫ్ట్ ఇవ్వరా అంటే ఇద్దరూ కూతుర్ని ఎత్తుకుని ముద్దు పెడతారు. ట్ కాసేపటికి ఖుషి పసుపు కోసం పరిగెడుతూ మాళవికని ఢీ కొడుతుంది. దీంతో ఖుషి చేతి పసుపు మాళవిక చీరకి అంటుకుంటుంది. బుద్ధి ఉందా నీకు నా చీర పాడు చేశావని తిడుతుంది. సోరి చెప్పినా కూడా మాళవిక వినకుండా తన మీదకి చెయ్యి ఎత్తెసరికి వేద వచ్చి ఆపుతుంది.

Also Read: ఖుషి మీద చెయ్యి ఎత్తిన మాళవిక- రొమాన్స్ లో మునిగితేలుతున్న వేద దంపతులు

వేద: నా బిడ్డ మీద చెయ్యి ఎత్తడానికి ఎంత ధైర్యం నీకు

మాళవిక: నీ బిడ్డ ఏంటి ఖుషి నా కూతురు

వేద: కడుపున కనగానే తల్లి అవవు. కడుపున పెట్టుకుని చూసుకోవాలి. ఖుషి నా కూతురు. ఇప్పటి దాకా నేను నా కూతుర్ని కోపంగా కూడా చూడలేదు. అలాంటిది నువ్వు చేయి ఎత్తి కొడతావా

మాళవిక: నా కూతురితో ఎలా ఉండాలో కూడా నువ్వు నేర్పిస్తావా. తప్పు చేసిన ఖుషిని మందలించకుండా నన్ను తిడతావా

వేద: అవును తప్పు చేసింది అయితే తనని కొడతావా. కూతురు అయితే మాత్రం తిట్టడానికి హక్కులు వచ్చేస్తాయా

యష్: ఖుషి నీ డ్రెస్ స్పాయిల్ చేసింది కానీ నువ్వు తన జీవితాన్ని స్పాయిల్ చేశావ్ కొట్టాలసింది నిన్ను

అందరూ మాళవికని తలా ఒక మాట తిడతారు. దీంతో మాళవిక కోపంగా వెళ్ళిపోతుంది. ఖుషిని వేద ఓదారుస్తుంటే మాలిని వచ్చి ధైర్యం చెప్తుంది. మాళవికకి బాగా బుద్ధి చెప్పావని వేదని మెచ్చుకుంటుంది. సుహాసిని భర్త శశిధర్ ఫోన్ మాట్లాడుతుంటే వేద వచ్చి పలకరిస్తుంది. నీ మొహంలో ఒక సంతృప్తి కనిపిస్తుంది. నువ్వు పోరాడి నీ భర్తని గెలుచుకున్నావ్. నీ బిడ్డ నీకే సొంతం. దేవుడితో అయినా ఫైట్ చేసి గెలవడం అలవాటు చేసుకోమని మంచి మాటలు చెప్తాడు.

Also Read: 'నీ ఇంటికొచ్చానంటూ' బాలయ్య లెవల్ లో మధుకర్ కి వార్నింగ్ ఇచ్చిన జానకి- తల్లికి ధైర్యం చెప్పిన రామ

పూజ పూర్తవగానే దంపతులు నైవేద్యం స్వీకరించడానికి ఏదో పద్ధతి ఉందని పంతులు చెప్పినట్టు సుహాసిని సైగ చేస్తుంది. అది అర్థం చేసుకున్న పంతులు భర్త ఒడిలో కూర్చుని భోజనం చేయాలని చెప్తాడు. భార్యని ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమగా తినిపించాలని అప్పుడే పూజ సార్ధకం అవుతుందని పూజా ఫలితం దక్కుతుందని చెప్తాడు. వేద భర్త ఒడిలో కూర్చుంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget