Janaki Kalaganaledu May 1st: 'నీ ఇంటికొచ్చానంటూ' బాలయ్య లెవల్ లో మధుకర్ కి వార్నింగ్ ఇచ్చిన జానకి- తల్లికి ధైర్యం చెప్పిన రామ
రామ బెయిల్ మీద ఇంటికి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రామ రావడంతో జ్ఞానంబ మొహం వెలిగితూ హడావుడి చేస్తుంది. అది చూసి వెన్నెల, జెస్సీ నవ్వుతారు. రామ ఇంకా టిఫిన్ తినడానికి రాలేదేంటని అడుగుతుంది. మధ్యలో గోవిందరాజులు దూరుతూ ఉంటాడు. రామ, జానకి వస్తారు. నువ్వు కళ్ళ ముందు కనిపించగానే జనాభా లెక్కల నుంచి తీసేసిందని గోవిందరాజులు జోక్ వేస్తాడు. మల్లిక వచ్చి పుల్ల విరుపు మాటలు మాట్లాడుతుంది. ఈ రోజు మన ఇల్లు ఒక చిన్న సైజు టిఫిన్ సెంటర్ లా ఉందని నవ్వురాని జోక్ వేసి మల్లిక తెగ నవ్వుతుంది. కొడుకు, కోడళ్ళకి ప్రేమగా వడ్డిస్తుంది. జానకితో కలిసి పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి రెండు రోజులు ప్రశాంతంగా ఉండి రమ్మని కొడుకుతో జ్ఞానంబ చెప్తుంది. మా అక్కకి ఫోన్ చేసి చెప్పేశానని అంటుంది. బెయిల్ మీద వచ్చిన సంగతి అమ్మకి తెలియదా ఊరు దాటి ఎలా వెళ్తానని రామ అనుకుంటాడు. రామ వాళ్ళు మౌనంగా ఉండటంతో ఏమైందని అడుగుతుంది.
Also Read: విక్రమ్, దివ్యకి ఫస్ట్ నైట్- లాస్య తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేసిన నందు
మల్లిక: బెయిల్ మీద బయటకి వచ్చిన బావ ఊరు దాటి వెళ్లకూడదు
జ్ఞానంబ: బెయిల్ ఏంటి
మల్లిక: అదేంటి బావ బయటకి వచ్చింది బెయిల్ మీద వచ్చిన సంగతి మీకు తెలియదా
జ్ఞానంబ: అంటే కేసు మూసేయలేదా. మల్లిక చెప్తుంది నిజమేనా సూటిగా చెప్పండి. నా నుంచి నిజం ఎందుకు దాచారు. పోలీస్ గా నీ తెలివి అంతా నా మీద చూపించడం కాదు భర్తని విడిపించడంలో చూపించు అది మాత్రం చేతకాదు. రామ విడుదలై వచ్చేశాడని పూజ చేశాను. చివరకు అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసి మోసం చేశారు
గోవిందరాజులు: కేసు మూసేయాలంటే దానికి టైమ్ పడుతుంది ప్రాసెస్ ఉంటుంది
జ్ఞానంబ: నేను ఎవరినీ నమ్మను నాతో ఎవరూ మాట్లాడొద్దు
రామ తల్లి దగ్గరకి వచ్చి నచ్చజెప్పడానికి చూస్తాడు. నువ్వు నిర్దోషివని రుజువు చేసే శక్తి జానకికి మాత్రమే ఉంది.
రామ: నా మీద పడిన నిందను కడిగేసుకుని కడిగిన ముత్యంలా నీ ముందు నిలబడతాను ప్రశాంతంగా ఉండు. మన మీద పడ్డవి తప్పించుకోలేని కష్టాలు విముక్తి ఎప్పుడో దేవుడు చూసుకుంటాడు. నేను బెయిల్ మీద బయటకి వచ్చినా ఎప్పటిలా ఉండవచ్చు కాకపోతే ఊరు దాటి వెళ్లకూడదు. నేను ఎప్పటిలా మిఠాయి బండి తీసుకుని వెళ్తున్నా
Also Read: ముకుంద మీద ఫైర్ అయిన రేవతి- మంచం పట్టిన భవానీ, వైద్యం చేసిన కృష్ణ
మధుకర్ జానకికి ఫోన్ చేస్తాడు కానీ లిఫ్ట్ చేయదు. ఎన్ని సార్లు చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి మనోహర్ కి ఫోన్ చేస్తాడు. వాడిని స్టేషన్ బెయిల్ మీద ఎందుకు విడుదల చేశావని అరుస్తాడు. జానకి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని తిడతాడు. పొద్దున్నే రామ బెయిల్ క్యాన్సిల్ చేస్తానని చెప్తాడు. ఎస్సైతో మాట్లాడుతూ ఉండగా ఎదురుగా జానకి ఉంటుంది. తనని చూసి షాక్ అవుతాడు.