By: ABP Desam | Updated at : 02 May 2023 09:18 AM (IST)
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
యష్, వేద సంతోషంగా గడుపుతారు. భార్యకి ప్రేమగా ముద్దు పెడతాడు. వేద సిగ్గు పడుతూ వెళ్ళిపోతుంది. చాలా క్యూట్ గా ఉంటుంది ఆ సీన్. మాలిని ఇంట్లో కుంకుమార్చన పూజ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సులోచన లేదని వేద అక్క బాధ పడుతుంది. తనకి మాత్రం ప్రశాంతంగా ఉందని మాలిని అనేసరికి వేద అక్క సుహాసిని గొడవకు దిగుతుంది. మా సిస్టర్ ని ఒక్క మాట అన్న కూడా ఒప్పుకొనని రత్నం అంటాడు. ఈ విషయంలో రత్నం, శర్మ గోడవకు దిగుతారు. అది చూసి మాలిని ఆపండి మా పేర్లు చెప్పుకుని మీరు దెబ్బలాడటానికి వీల్లేదని చెప్తుంది. చిత్ర, వసంత్ రొమాన్స్ లోకి వెళ్లిపోతారు. వసంత్ కి కొత్త డ్రెస్ తీసుకొచ్చి వేసుకోమని ఇస్తుంది. పూజకి మాళవిక వస్తుంటే మాలిని గుమ్మం దగ్గరే ఆగమని అంటుంది. ఎందుకు వచ్చావ్ ఎవరిని అడిగి వచ్చావ్, మళ్ళీ ఏం చిచ్చు పెడదామని వచ్చావాని నిలదీస్తుంది. అసలు పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావని అడుగుతుంది.
Also Read: 'నీ ఇంటికొచ్చానంటూ' బాలయ్య లెవల్ లో మధుకర్ కి వార్నింగ్ ఇచ్చిన జానకి- తల్లికి ధైర్యం చెప్పిన రామ
మీ ఇంట్లో పూజ అని వసంత్ చెప్పాడు వేద ఒప్పుకుంటే వస్తానని చెప్పాను తను ఒప్పుకుందని అంటుంది. పూజకి వస్తానంటే వద్దని చెప్పలేక రమ్మన్నానని వేద చెప్తుంది.
మాళవిక: నీ ప్లేస్ లో నేను ఉంటే నిన్ను ఇక్కడికి రానిచ్చేదాన్ని కాదు
వేద: నీ ప్లేస్ లో నేను ఉంటే పిలిచినా వచ్చే దాన్ని కాదు
మాళవిక: ఇప్పటికైతే నా మీద నీదే పైచేయి ఒప్పుకుంటాను
వేద: నీకు మంచి బుద్ధి పుట్టాలని నీ తరఫున నేను కోరుకుంటాను. మర్యాదగా పిలిచాను మర్యాద నిలుపుకుని వెళ్ళు
Also Read: విక్రమ్, దివ్యకి ఫస్ట్ నైట్- లాస్య తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేసిన నందు
పూజకి వచ్చిన ముత్తైదువులకు బొట్టు పెట్టి వాళ్ళ కాళ్ళకి పసుపు రాస్తుంది. తర్వాత వేద వెనక్కి నడుస్తుంటే యష్ తగులుతాడు. తన చైన్ లో వేద జుట్టు ఇరుక్కుంటుంది. సందు దొరికింది కదా అని ఇద్దరూ కాసేపు కళ్ళతోనే రొమాన్స్ చేస్తారు. అది చూసి మాళవిక వచ్చి మీ ఇద్దరినీ నేను విడగొడతానని అంటుంది. మీ ఇద్దరి చిక్కుముడి నేను విప్పుతానులే అంటుంది. అది నీ తరం కాదు మాది మూడు ముళ్ళతో పడిన బంధం నువ్వు విడదీయలేవని వేద గట్టిగా చెప్తుంది. పీటల మీద కూర్చుని వేద, యష్ అమ్మవారికి పూజ చేస్తారు. పద్నాలుగు జన్మలు నా కొడుకు, కోడలు కలిసి ఉండాలి. నా కోడలు మీద ఏ పాపిస్టి వాళ్ళ కన్ను పడకూడదని పూజ చేయమని పంతులకి మాలిని చెప్తుంది. వేద, యష్ ఇద్దరూ కలిసి అమ్మవారికి హారతి ఇస్తారు. మాళవిక యష్ భార్యతో ప్రేమగా ఉండటం చూసి కుళ్ళుకుంటుంది. వాళ్ళని ఎలాగైనా విడగొట్టాలని ట్రై చేస్తుంది.
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి
రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!
వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?