By: ABP Desam | Updated at : 01 May 2023 08:52 AM (IST)
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
యష్ ని తీసుకుని వేద సంతోషంగా ఇంటికి వస్తుంది. కొడుకుని చూసి మాలిని మొహం కోపంగా పెడుతుంది. ఏంటి అందరూ కోపంగా చూస్తున్నారు ఏంటని అడుగుతాడు. నువ్వు చేసిన గొప్ప పనికి సన్మానం ఎలా చేయాలా అని చూస్తున్నామని అంటుంది. ఖుషి కోపంగా వచ్చి నాకు చెప్పకుండా వెళ్లిపోతావా, మమ్మీ నేను నీకు వద్దా అడుగుతుంది. సోరి తప్పు చేశానంటాడు. తప్పుకు పనిష్మెంట్ గుంజీలు తీయాలని చెప్తుంది. యష్ గుంజీలు తీస్తుంటే డాడీ కదా వద్దని అంటుంటే నువ్వు మాట్లాడితే మరొక ఫైవ్ పెంచుతానని అనేసరికి వేద సైలెంట్ అవుతుంది. అందరూ నవ్వుకుంటూ ఉండగా విన్నీ వస్తాడు.
Also Read: ఘనంగా అఖిల్ బాబు బారసాల- జ్ఞానంబకు అసలు విషయం చెప్పిన మల్లిక
విన్నీ: మీ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. యష్ నీకు నీమీద కంటే వేదూ మీద ఎక్కువ ప్రేమ. వేదూ నువ్వు సేమ్ టూ సేమ్. కానీ బయట పడరు. అందువల్ల ఈ గ్యాప్. లవ్ అంటే ఒక ఎక్స్ ప్రెషన్ చెప్పుకోండి మనసులు పంచుకోండి. ఫీల్ ది లవ్, షేర్ ది లవ్ అని యష్ వేదలను కలుపుతాడు. నువ్వు వైఫ్ అవడం యష్ లక్కీ అనుకున్నా కానీ ఇప్పుడు చెప్తున్నా యష్ నీ భర్త అవడం లక్. నా ప్రాజెక్ట్ పూర్తయింది. నేను అమెరికా వెళ్లిపోతున్నానని అందరికీ బై చెప్పేసి వెళ్ళిపోతాడు.
యష్ నిద్రపోతుంటే వేద తనని అలాగే చూస్తూ ఉంటుంది. తల మీద చెయ్యి వేసి నిమురుతూ నుదురు మీద ముద్దు పెడుతుంది. ఎంత ముద్దు వస్తున్నాడో మా శ్రీవారు. మీకు దూరంగా ఉంటే ఎంత బాధగా ఉంటే తెలుసా? మీరు ఇంత దగ్గరగా ఉంటే ఎంత సంతోషంగా ఉందో. నాకు అన్నీ జన్మలకు మీరే భర్తగా కావాలని అంటుంటే యష్ కళ్ళు తెరుస్తాడు. వేద పడుకున్నట్టు నటిస్తుంది. చాలు నీ పెర్ఫామెన్స్ మొత్తం వినేశానని అనేసరికి వేద నవ్వుతూ లేచి కూర్చుంటుంది. భర్త భుజం మీద తలవాల్చి సంతోషంగా ఉంటుంది. ఎటైనా ట్రిప్ కి వెళ్దామా అంటే వేద సంతోషంగా వెళ్దామని అంటుంది. ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటారు.
Also Read: రాజ్యలక్ష్మి దగ్గర డబ్బు ఎందుకు తీసుకున్నావని నిలదీసిన నందు- నిజం కక్కేసిన లాస్య
మాలిని పంతులను పిలిపించి తమ కొడుకు కోడలు సంతోషంగా ఉండాలంటే ఏదైనా పూజ చేయించమని అడుగుతాడు. కొడుకు, కోడలు మధ్య గొడవలు రాకూడదంటే అమ్మవారికి కుంకుమార్చన చేయించమని సలహా ఇస్తాడు. అందుకు ఏర్పాట్లు చేయించమని మాలిని అంటుంది. వేద వాళ్ళు రాగానే మాలిని పూజ సంగతి చెప్తుంది. అందుకు కావాల్సిన సరుకులు తానే వెళ్ళి తీసుకొస్తానని చెప్తుంది. చిత్ర, వేద షాపింగ్ కి వెళతారు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మాళవిక వస్తుంది. వసంత్ పెళ్లి జరగాలంటే మాట్లాడాల్సింది తనతో కాదు వాళ్ళ అక్క మాళవికతో అంటుంది. పూజ ఏదో చేస్తున్నావంట కదా ఎందుకో దగ్గరుండి చూడాలని అనిపిస్తుంది రమ్మంటావా అని మాళవిక అడుగుతుంది. తప్పకుండా రమ్మని పిలుస్తుంది. నేను వచ్చేది నీ కాపురాన్ని చెడగొట్టడానికని మాళవిక మనసులో అనుకుంటుంది.
మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!
Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ
సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!
Arjun Kapoor-Malaika Arora: బెడ్పై అర్ధనగ్నంగా బాయ్ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!
‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్
AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా
Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ
Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్మెంట్ రేపే!