Gruhalakshmi April 29th: రాజ్యలక్ష్మి దగ్గర డబ్బు ఎందుకు తీసుకున్నావని నిలదీసిన నందు- నిజం కక్కేసిన లాస్య
దివ్య, విక్రమ్ పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
![Gruhalakshmi April 29th: రాజ్యలక్ష్మి దగ్గర డబ్బు ఎందుకు తీసుకున్నావని నిలదీసిన నందు- నిజం కక్కేసిన లాస్య Gruhalakshmi Serial April 29th episode 932 Written Update Today Episode Gruhalakshmi April 29th: రాజ్యలక్ష్మి దగ్గర డబ్బు ఎందుకు తీసుకున్నావని నిలదీసిన నందు- నిజం కక్కేసిన లాస్య](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/29/4497ca015f6ce7473e1ac7d5ac327e081682737673270521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఎంబీబీఎస్ చదివిన మీకు చదువు లేని బావని పెళ్లి చేసుకున్నందుకు నామోషిగా చిన్నతనంగా ఎప్పుడూ అనిపించలేదా అని ప్రియ అడుగుతుంది. మా మధ్య ప్రేమ ఉందని ఆ ఆలోచన రాలేదని దివ్య చెప్తుంది. కూతురు వంట చేయడానికి ఎటువంటి పాట్లు పడుతుందోనని తులసి తనలో తనే నవ్వుకుంటుంది. లాస్య హాస్పిటల్ లోకి వెళ్ళడం ఆటోలో వెళ్తున్న రాములమ్మ చూస్తుంది. లాస్యకి హాస్పిటల్ లో ఏం పనని తులసి అనుమానపడుతుంది. మార్కెట్ పని తర్వాత చూసుకుందామని అనుకుని ఇద్దరూ లాస్యని వెతుక్కుంటూ హాస్పిటల్ లోపలికి వెళతారు. వంట ఘుమఘుమలు విక్రమ్ ని వంటింట్లోకి లాక్కోచ్చేస్తాయి. కూర కొంచెం టేస్ట్ చేస్తానని అడుగుతాడు. విక్రమ్ పెళ్ళాన్ని ముద్దుబెట్టుకోబోతుంటే ఇది కాదు తీసుకోమంది గుత్తి వంకాయ కూర అంటుంది. విక్రమ్ కూర నోట్లో వేసుకుని విచిత్రంగా ఫేస్ పెట్టేస్తాడు. ఈ కూర ఎవరికీ పెట్టకు తన కోసమే ఉంచమని అంటాడు. కూర చండాలంగా ఉందని చెప్పలేక అల్లాడిపోతాడు.
Also Read: ఈ అత్తాకోడళ్ళు మాములోళ్ళు కాదు కడుపుబ్బా నవ్వించేశారు- భవానీ మనసు కృష్ణ మారుస్తుందా?
దివ్య తర్వాత తన కూర టేస్ట్ చేసి ఇంత చేదుగా ఉంటే చెప్పొచ్చు కదా అంటుంది. ఇప్పుడు ఎలా అని బిక్క మొహం వేస్తుంది. దివ్య తల్లికి ఫోన్ చేసి కూర చేదుగా వచ్చిందని చెప్తుంది. నర్స్ తులసిని పలకరించి లాస్య వచ్చిందని రాజ్యలక్ష్మితో మాట్లాడుతుందని చెప్తుంది. ప్రియ విక్రమ్ తండ్రికి భోజనం తీసుకెళ్తుంటే దివ్య వచ్చి నేనే తీసుకెళ్తానని అంటుంది. ప్రియ వద్దని చెప్తున్నా కూడా దివ్య బలవంతంగా తనే వెళ్తుంది. రోజు భోజనం తనే తీసుకొస్తానని అంటుంది. గది చీకటిగా ఉందని దివ్య లైట్ ఆన్ చేసేసరికి ప్రకాశం కోపంతో ఊగిపోతాడు. దివ్య భయపడుతూ బయటకి పరుగులు పెడుతుంది. తులసి వాళ్ళు లాస్యని గది బయట నుంచి చూస్తూ ఉంటారు. మొన్న పరిచయం అయిన ఆమెతో అంత చనువుగా ఉంది ఏంటని తులసి అనుమానపడుతుంది.
Also Read: మనసు అడ్డు తెరలు తొలగిపోయాయి, సూపర్ ఎపిసోడ్- ఒక్కటైన యష్, వేద
డబ్బులు ఇవ్వమని లాస్య రాజ్యలక్ష్మిని అడుగుతుంది. పగబట్టాను అంటే నా వాళ్ళ పరాయి వాళ్ళా అని చూడనని రాజ్యలక్ష్మి అంటుంది. కూతురు పెద్దింటి కోడలు అయ్యిందని వియ్యపురాలు తెగ సంబరపడుతుందని లాస్య చెప్తుంది. రాజ్యలక్ష్మి డబ్బులు ఉన్న సూట్ కేస్ లాస్య ముందు పెడుతుంది. అది చూసి తులసి వాళ్ళు షాక్ అవుతారు. అంత డబ్బు ఎందుకు ఇస్తుందని రాములమ్మ అనుమానపడుతుంది. సంతోషంగా డబ్బులు తీసుకుని లాస్య వెళ్ళిపోతుంది. అంత డబ్బు చేతులు మారిందంటే ఏదో జరగబోతోందని తులసి డౌట్ పడుతుంది. దివ్య తన మావయ్య గురించి ఆలోచిస్తూ ఉంటే విక్రమ్ వస్తాడు. మావయ్య అందరికీ దూరంగా ఉండటానికి ఏదో ఒక కారణం ఉందని దివ్య అంటుంది. నా కన్న తల్లి మీద దిగులు పెట్టుకున్నారు ఆ నిరాశ నుంచి బయటకి రాలేకపోతున్నారు. ఆయన మారతారనే ఆశతో రెండో పెళ్లి చేశారు. కానీ ఆయన తీరు మారలేదని విక్రమ్ అంటాడు. ఆయన ఆరోగ్యం కుదుటపడేందుకు కావాలంటే నీ ప్రయత్నం నువ్వు చేయమని చెప్తాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)