Krishna Mukunda Murari April 28th: ఈ అత్తాకోడళ్ళు మాములోళ్ళు కాదు కడుపుబ్బా నవ్వించేశారు- భవానీ మనసు కృష్ణ మారుస్తుందా?
నందిని పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
అందరూ వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ, మురారీ భోజనం చేసేందుకు వస్తారు. కానీ అన్నీ గిన్నెలు ఖాళీగా ఉండటంతో కన్నీళ్ళు పెట్టుకుని ఆకలితో వెళ్లిపోతారు. అన్నం లేకుండా చేసి కడుపు కాల్చారని కృష్ణ బాధపడుతుంది. ఆకలికి నువ్వు ఉండలేవు బయటకి వెళ్ళి తిందువుగాని అని మురారీ వద్దని అంటుంది. ఆకలితో రాత్రంతా ఉండలేవు కదా అంటాడు. దేవుడు పై నుంచి నాలుగు పండ్లు పంపిస్తే అని కృష్ణ అనగానే టక టకామని డోర్ కొడతారు. మురారీ వెళ్ళి చూసేసరికి బయట ఎవరూ ఉండరు. కానీ డోర్ దగ్గర కట్ చేసిన యాపిల్స్, అరటి పండ్లు పెట్టి ఉంటాయి. బయట ఎవరూ లేరా అయితే దేవత నేను ఇలా తలుచుకోగానే ఫ్రూట్స్ పెట్టి మాయం అయిపోయిందని కృష్ణ సంబరపడుతుంది. రేవతి చాటుగా ఉంది మురారీ లోపలికి వెళ్ళిన తర్వాత అవి తీసుకున్నారా లేదా అని చూస్తుంది. ప్రతి ఇంటికి వ దేవత ఉంటుంది ఆ ఇలవేల్పు మా అమ్మ. నాకు తెలుసు ఇవి రేవతి అత్తయ్య తెచ్చిపెట్టారని అంటుంది.
Also Read: మనసు అడ్డు తెరలు తొలగిపోయాయి, సూపర్ ఎపిసోడ్- ఒక్కటైన యష్, వేద
మురారీ వాళ్ళు ఇంకా గది నుంచి బయటకి రాలేదని ముకుంద ఎదురుచూస్తూ ఉంటుంది. కృష్ణ ఎంత పని చేశావ్ నీ వల్ల అందరితో పాటు మురారీ నాకు దూరం అయ్యాడు. తనని ఎదురుగా చూస్తూ మాట్లాడకుండా నేను ఉండలేను. నీకు మురారీకి మధ్య ప్రేమ లేదు కానీ ఒకే గదిలో సంతోషంగా ఉన్నావ్. నాకు నీ తాళి అడ్డుగా ఉంది. మీతో ఎవరూ మాట్లాడొద్దని పిచ్చి రూల్ పెట్టారని ముకుంద బాధపడుతుంది. మురారీని నిద్రలేపేందుకు కృష్ణ పాట పాడుతుంది. తల దువ్వి జడ వేస్తారా అని అంటే లేదు గుండు చేస్తానని అంటాడు. ఇద్దరూ కాసేపు సరదాగా కొట్లాడుకుని ఒకరి మీద ఒకరు పడిపోతారు. కాసేపు కళ్ళతోనే రొమాన్స్ చేసుకుంటారు. కృష్ణ టిఫిన్ రెడీ చేయడానికి కిచెన్ లోకి వెళ్తుంది. అక్కడ రేవతి ఉంటే పలకరిద్దామనీ కూడా కృష్ణ ఆగిపోతుంది. ఎవరూ చుట్టుపక్కల లేరని చూసి రేవతి పెళ్లి బాగా జరిగిందా అని మెల్లగా అడుగుతుంది.
అప్పుడే అటుగా ఈశ్వర్ రావడం చూసి ఇద్దరూ మాట్లాడుకోవడం ఆపేస్తారు. మొత్తానికి ఘటికురాలివే పెళ్లి చేయకుండా ఇంటికి రావొద్దని అన్నానని పెళ్లి చేశావని మెచ్చుకుంటుంది. మళ్ళీ ప్రసాద్ రావడం చూసి మాట్లాడుకోరు. రేవతి కృష్ణతో మాట్లాడటం భవానీ చూస్తుంది. నేను ఏం చెప్పాను నువ్వు ఏం చేస్తున్నావని అరుస్తుంది. మనం వెలివేసిన మనుషులతో ఎందుకు మాట్లాడావని అంటుంది. ఇద్దరూ మళ్ళీ మాట్లాడుకుంటారు. నా మాట ఖాతరు చేయకుండా ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకున్నారా? నిన్ను కూడా వెలివేయమంటావా అంటుంది. వద్దు ఈ ఇంట్లో వంట చేసేది రేవతి అత్తయ్య వెలివేస్తే హోటల్ నుంచి భోజనం తెప్పించుకోవాల్సి వస్తుందని కృష్ణ అమాయకంగా మాట్లాడుతుంది. పనిలో పనిగా ఇద్దరూ తెగ మాట్లాడేసుకుంటారు. నా మాటలు వినిపించకూడదని చెవిలో పల్లీలు కూడా పెట్టుకున్నారు కదా అని కృష్ణ రేవతి చెవిలో నుంచి పల్లీలు తీస్తుంది.
Also Read: నడిరోడ్డు మీద జెస్సి బాబు- జానకి మీద పోలీస్ కేసు పెడతానన్న అఖిల్
నేను రాగానే ఏమైనా మాట్లాడతానేమో అని పల్లీలు పెట్టుకున్నారని అంటుంది. నిజం చెప్పు మీ అత్తయ్య నీతో మాట్లాడలేదా అని అందరూ కృష్ణని పలకరిస్తారు. మధ్యలో ముకుంద కల్పించుకుని అందరూ భలే మాట్లాడుతున్నారని అంటుంది. నేను ఇప్పటి వరకు రేవతితో మాట్లాడుతుంటే మీరందరూ వచ్చి కృష్ణతో మాట్లాడతారు ఏంటని భవానీ అరుస్తుంది.