Janaki Kalaganaledu April 29th: ఘనంగా అఖిల్ బాబు బారసాల- జ్ఞానంబకు అసలు విషయం చెప్పిన మల్లిక
రామ బెయిల్ మీద బయటకి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జానకి బాబు ఎలా దొరికాడో చెప్తుంది. అది విని అఖిల్ చేసిన బాబు కనిపించిన విషయం గుర్తు చేసుకుంటాడు. వెంటనే మేరీ కోపంతో బట్టలు సర్దుకో జెస్సీ ఇక్కడ నీకు రక్షణ లేదని అరుస్తుంది. ఎప్పుడైతే ఈ ఇంటికి కోడలిగా పంపావో అప్పుడే నా మీద హక్కు కోల్పోయావ్ నా కాపురం చెడగొట్టాలని చూడకని జెస్సీ సమాధానం ఇస్తుంది. ఇక నుంచి అందరం బాబుని కంటికి రెప్పలా కాపాడుకుంటామని జానకి మాట ఇస్తుంది. అసలు సమస్య నీతోనే నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోతే అందరికీ ప్రశాంతంగా ఉంటుందని మేరీ అంటుంది. నువ్వు ఈ ఇంటికి చుట్టానివి బారసాల చూసుకోని వెళ్ళమని జెస్సి తిడుతుంది. జరిగిన అవమానం చాలు వెళ్లిపోదాం పదండని మేరీ అనేసరికి జానకి వాళ్ళకి క్షమాపణ చెప్తుంది. నీ కోపం జెస్సి మీద మనవడి మీద కాదు కదా అని పీటర్ కూడా సర్ది చెప్తాడు. అందరూ రెడీ అయ్యి రండి బారసాల చేద్దామని జ్ఞానంబ అంటుంది.
Also Read: రాజ్యలక్ష్మి దగ్గర డబ్బు ఎందుకు తీసుకున్నావని నిలదీసిన నందు- నిజం కక్కేసిన లాస్య
వేడుకగా బారసాల జరుగుతుంది. అబ్బాయి పుడితే విష్ణు అన్నయ్య మీ పేరు పెట్టాలని అనుకున్నాడు కానీ ఇప్పుడు ఆ అదృష్టం తనకి దక్కిందని అఖిల్ తండ్రి పేరు పెట్టాలని డిసైడ్ అవుతాడు. కానీ ఒక కండిషన్ నా మీద కోపం వచ్చినప్పుడల్లా బుద్ధి లేదా గోవిందరాజులని వాడిని తిట్టకూడదని అంటాడు. సాయి గోవిందు అని పేరు పెట్టానని అఖిల్ చెప్తాడు. తర్వాత వాడిని ఉయ్యాలలో వేస్తారు. రామ, జానకి గదిలో సరసాలు మొదలు పెడతారు. భోజనం చేయగానే చిలకలు తినాలని అనిపిస్తుందని అనేసరికి ప్రేమగా తినిపిస్తుంది. ఒక విషయంలో చాలా బాధగా అనిపించిందని అంటాడు. అఖిల్ అత్త మనల్ని ఇష్టం వచ్చినట్టు అంటుంటే వాడు ఒక్క మాట ఎదురు చెప్పలేదని రామ బాధపడతాడు. అత్తయ్య మావయ్య తర్వాత అందరినీ ఒక గూటిలో కలపాల్సిన బాధ్యత మనది ఏదైనా కడుపులో దాచుకుందామని భర్తకి హితబోధ చేస్తుంది.
Also Read: మనసుల్ని మెలిపెట్టించేసిన కృష్ణ, భవానీ- భార్యని చూసి మురిసిపోతున్న మురారీ
జ్ఞానంబ జానకిని పిలిచి మామిడి పండ్లు రామకి ఇష్టం ఇవి తింటే వాడు లోకాన్నే మర్చిపోతాడని అంటుంది. జానకికి మల్లెపూలు ఇస్తే ఇవి నా తలలో ఉంటే మీ అబ్బాయి లోకాన్ని మర్చిపోతాడని సిగ్గుపడుతూ చెప్తుంది. ఈరోజు బారసాల సందడిగా జరిగిందంటే అందుకు కారణం నువ్వే. నేను ఉక్రోషంతో నిన్ను దూరం పెట్టినా వాడిని విడిపించావు. ఇక ముందు వాడు జైలు మొహం చూడకుండా కోర్టు మెట్లు ఎక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని చెప్తుంది. రామ బెయిల్ మీద బయటకి వచ్చారని తెలిస్తే అత్తయ్య తట్టుకోలేదని జానకి మనసులో బాధపడుతుంది.