(Source: ECI/ABP News/ABP Majha)
Krishna Mukunda Murari April 29th: మనసుల్ని మెలిపెట్టించేసిన కృష్ణ, భవానీ- భార్యని చూసి మురిసిపోతున్న మురారీ
నందిని పెళ్లి గౌతమ్ తో చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
అత్తాకోడళ్ళు మాట్లాడుకోవడం భవానీ చూసి అరుస్తుంది. ఏయ్ జాగ్రత్త ఇంకోసారి ఎవరితోనైనా మాట్లాడినట్టు కనిపిస్తే అని భవానీ అంటుంటే పెద్దత్తయ్య మీరే ఇప్పుడు నాతో మాట్లాడారు అంటుంది. పెద్దమ్మ కోపాన్ని కృష్ణ ఇంత సింపుల్ గా తీసుకుంటుంది ఇప్పుడు అందరితో కలిసి టిఫిన్ తినాలా అని మురారీ ఆలోచిస్తూ ఉంటాడు. భవానీ కూడా అప్పుడే టిఫిన్ కోసం వస్తూ కృష్ణ మురారీని పిలవడం విని డైనింగ్ టేబుల్ దగ్గరకి రాకుండా ఆగిపోతుంది. కిచెన్ లో రేవతి ఉప్పు, కారం కోసం వెతుకుతుంటే ముకుంద వచ్చి ఏమైందని అడుగుతుంది. ముకుంద వచ్చి పేపర్ మీద రాసి కృష్ణని అడుగుతుంది. కిచెన్ లో పై షెల్ఫ్ లో ఉన్నాయని అరిచి మరీ చెప్తుంది. కృష్ణ పేపర్ మీద రాసి ఇవ్వవచ్చు కదాఅని ముకుంద మెల్లగా అంటుంది. ఏదో ఒక వంకతో అందరూ తనతో మాట్లాడుతున్నారని భవానీ తిడుతుంది. అది చూసి నువ్వు కేక కృష్ణ అని మురారీ మనసులో అనుకుంటాడు.
Also Read: ఉత్కంఠ వీడింది, బాబుని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన జానకి- సంతోషంలో జ్ఞానంబ కుటుంబం
కన్నకూతుర్ని వదులుకున్న దాన్ని ఎక్కడి నుంచో వచ్చిన ఆ పిల్లని ఎలా క్షమిస్తానని భవానీ అంటుంటే కానీ మురారీ అని ఈశ్వర్ అంటుండగా ఏమైపోతే ఏంటని కృష్ణ వస్తుంది.
కృష్ణ: కృష్ణుడు ఫోటో ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. పేరుకే పెంచిన తల్లి కానీ పవర్ ఫుల్. మీ ఒడిలో పెరిగిన బాల కృష్ణుడే కదా కాస్తా కనికరం చూపించొచ్చు కదా యశోధమ్మ. మురారీకి మరొక పేరు కృష్ణ. మన్ను తిన్న అతడే. మిన్ను తిన్న అతడే. అన్ని చోట్ల అతడే. సుభధ్ర పరిణయం జరిపించాడని అలకబూనితే ఆ కన్న ప్రేమని చిన్నబుచ్చడం కాదా? గోకులంలో నువ్వు ద్వారకలో కన్న తల్లి ఎవరూ మాట్లాడకపోతే బృందావనంలో మోము మాడిపోయి కూర్చున్న కృష్ణయ్యని చూడండి. పాపం కదా. అమ్మ అన్నం పెట్టడం లేదు, పెద్దమ్మ క్షమాభిక్ష పెట్టడం లేదు లాలించే చేతులే శాసిస్తే వరాలిచ్చే ఆ దేవుడు ఒంటరిగా మిగిలిపోయాడు. కృష్ణుడు ఏలిన ఈ ద్వారక ఈ నల్లనయ్యలాగే చీకటి అయిపోయిందని ఏడుస్తుంది. ఆ మాటలన్నీ వింటూ భవానీ గుండె పగిలిపోతుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.
Also Read: ఈ అత్తాకోడళ్ళు మాములోళ్ళు కాదు కడుపుబ్బా నవ్వించేశారు- భవానీ మనసు కృష్ణ మారుస్తుందా?
మురారీ కృష్ణతో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుని మురిసిపోతూ ఉంటారు. అప్పుడే కృష్ణ వస్తుంది. నువ్వు సూపర్ కృష్ణ అందరితో భలే మాట్లాడావ్ అని మెచ్చుకుంటాడు. నందిని లాంటి కూతురు నాకు ఉంటే నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని అంటుంది. నీ మాట నేను ఎప్పుడైనా కాదని అంటానా అంటాడు. అవును మనం ఏంటి నిజం భార్యాభర్తలుగా మాట్లాడుకుంటున్నామని ఆగిపోతుంది. ఇదేదో బాగుంది ఒక సారి నిజం భార్యాభర్తలులాగా మాట్లాడుకుందామని మురారీ అడుగుతాడు. పాచి పని చేసే కిట్టమ్మని నువ్వు నేను ఆటో నడుపుకునే వాడిని అని క్యారెక్టర్లు మార్చుకుంటారు. ఇద్దరూ కాసేపు సరదాగా కామెడీగా మాట్లాడుకుంటారు. కృష్ణ కొట్టబోతుంటే తూచ్ ఈ మొగుడు పెళ్ళాల ఆట నాకు నచ్చలేదని ఆపేస్తాడు.