అన్వేషించండి

Janaki Kalaganaledu April 28th: ఉత్కంఠ వీడింది, బాబుని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన జానకి- సంతోషంలో జ్ఞానంబ కుటుంబం

జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

తన నిర్లక్ష్యం కారణంగానే బాబు కనిపించకుండా పోయాడని జానకి జెస్సిని క్షమాపణలు అడుగుతుంది. మళ్ళీ ఇంటికంటూ వస్తే బాబుతోనే వస్తానని జానకి వాళ్ళు వెళతారు. విష్ణు, అఖిల్ తలా ఓ వైపు బిడ్డ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే అఖిల్ దగ్గరకి బాబుని తీసుకున్న భిక్షగత్తె వచ్చి పాలకి డబ్బులు కావాలి దానం చేయమని బతిమలాడుతుంది. కానీ అఖిల్ బాబుని చూడకుండా ఆమెని తిట్టేసి వెళ్ళిపోతాడు. చిన్న బాబుని ఎవరైనా ఎత్తుకోవడం మీరు చూశారా అని అఖిల్ రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని అడగటం వింటుంది. ఈ బాబు తన బాబే అని పెద్దావిడ వెనుకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంది కానీ అఖిల్ మాత్రం తప్పించుకుని పారిపోతాడు. మీ నాన్న దరిద్రం చూశావా నిన్ను ఇద్దామని పరిగెడితే చూడకుండా వెళ్లిపోయాడని ఆమె బాధపడుతుంది.

Also Read: ఈ అత్తాకోడళ్ళు మాములోళ్ళు కాదు కడుపుబ్బా నవ్వించేశారు- భవానీ మనసు కృష్ణ మారుస్తుందా?

బాబు ఏడవడటం చూసి జానకి వచ్చి తిడుతుంది. బాబు ఏడుస్తుంటే పట్టించుకోవా అంటుంది. బాబుకి పాలు కొనలేని పరిస్థితి ఎంత అడిగినా దానం చేయలేదని చెప్తుంది. దీంతో జానకి పాలు తీసుకురావడానికి వెళ్తుంది. ఇంట్లో అందరూ బాబు కోసం టెన్షన్ పడుతూ ఉంటారు. జెస్సి బాబు కోసం ఏడుస్తుంటే బాబు తప్పకుండా వస్తాడని వెన్నెల ధైర్యం చెప్తుంది. వెతకడానికి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఫోన్ చేయలేదని పీటర్ అనేసరికి ఎవడు ఎత్తుకెళ్లాడో ఎవరికి అమ్ముకున్నారోనని మల్లిక నోటికి పని చెప్తుంది. ఆ మాటకి జ్ఞానంబ డీలా పడిపోతుంది. మల్లిక దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతుంది. పోలీసు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఊరంతా శత్రువులేనని అంటుంది. ఆ మాటలకి జ్ఞానంబ కళ్ళు తిరిగిపడిపోతుంది. గుటుక్కుమంటే పరవాలేదు కానీ అటూ ఇటూ అయితే సేవలు చేయలేక చావాలని మల్లిక మనసులో తిట్టుకుంటుంది.

Also Read: మనసు అడ్డు తెరలు తొలగిపోయాయి, సూపర్ ఎపిసోడ్- ఒక్కటైన యష్, వేద

జానకి బాబుకి పాలు ఇచ్చి తాగించమని పెద్దావిడకి చెప్తుంది. ఆమె బాబు మొహం మీద ఉన్న దుప్పటి తీసేసరికి జానకి చూస్తుంది. వెంటనే ఎత్తుకుని గుండెలకు హత్తుకుని ఏడుస్తుంది. బాబు దొరికాడని రామని పిలుస్తుంది. ఈ బాబు నీ బాబు కాదు కదా అని అడుగుతుంది. కాదు రోడ్డు పక్కన పడి ఉంటే పెంచుకుందామని తెచ్చాను. వీళ్ళ నాన్న కనిపించాడు. కానీ పిలిచే లోపు వెళ్లిపోయాడని చెప్తుంది. జానకి వాళ్ళు ఆమెకి థాంక్స్ చెప్పి బిడ్డని తీసుకుని ఇంటికి బయల్దేరతారు. అఖిల్, విష్ణు వాళ్ళు ఒట్టి చేతులతో ఇంటికి వస్తారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పెద్ద వదిన మీద కంప్లైంట్ చేస్తానని అఖిల్ అంటాడు. నా బాబు కంటే నాకు పరువు ఎక్కువేమీ కాదని చెప్తాడు. అలా చేస్తే జానకిని అరెస్ట్ చేస్తారని జ్ఞానంబ అంటే చేయనివ్వు అప్పుడే తిక్క కుదురుతుందని అంటాడు. అఖిల్ వెళ్లబోతుంటే జానకి వాళ్ళు ఎదురొచ్చి బాబుని ఇస్తారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget