News
News
X

Ennenno Janmalabandham August 26th: ఖైలాష్ చెంప పగలగొట్టిన వేద, మాళవికకి బుద్ధి చెప్పిన ఖుషి, బద్ధలైన తండ్రి హృదయం

యష్ మీద పగ సాధించడానికి అభిమన్యు తన కొడుకు ఆదిత్యని పావుగా వాడుకుంటాడు. తన మనసులో యష్ మీద విషం నింపుతాడు. అది నిజమనుకున్న ఆది తండ్రిని అసహ్యించుకుంటాడు.

FOLLOW US: 

ఖుషిని చూడగానే మాళవిక తనని దగ్గరక తీసుకుని ముద్దాడుతుంది. నేను నీకోసం చాలా వెయిట్ చేస్తున్నాను అని మాళవిక అంటే అవును ఖుషి నీకోసం మీ మమ్మీ ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉంది నువ్వు వచ్చావాని తెలిసినాక కంట్రోల్ అయ్యింది కానీ మీ నాన్న, వేద తనని పట్టించుకోరు నీతో మాట్లాడకుండా చేస్తున్నారని అభిమన్యు అంటాడు. ఏంటి అంకుల్ మీరు ఎప్పుడు ఇలాగే అబద్ధాలు చెప్తారా అని ఖుషి అంటుంది. నేను అబద్ధాలు చెప్పడం ఏంటి అంటాడు. అప్పుడు కూడా అంతే మా అమ్మ నన్ను కోర్టులో వదిలివెళ్లిపోయిందని చెప్పారు కానీ తను ఎక్కడికి వెళ్లలేదు ఎప్పుడు నన్ను ప్రేమగా చూసుకుంటుందని చెప్తుంది.

ఆదిత్యని చూడగానే రత్నం, మాళని చాలా సంతోషిస్తారు. అచ్చం యష్ పోలికే కదా అని మాలిని అంటే నాకు ఎవరు పోలికలు లేవని ఆది అంటాడు. ఇలాంటి మాటలు గట్టిగా చెప్పకండి ఎవరైనా వింటారని కోపంగా చెప్తాడు. వింటే ఏమవుతుంది నిజమే కదా అని మాలిని అంటే నాకు ఇష్టం లేదని ఆది అంటాడు. సీన్ మళ్ళీ ఖుషి దగ్గరకి వస్తుంది. ఇప్పడు కూడా నువ్వు ఏడుస్తున్నావని అబద్ధాలు చెప్తున్నాడు, ఏడిస్తే నీ కళ్ళు రెడ్ గా రావాలి, నీ ఫేస్ డల్ గా ఉండాలి, కళ్ల కింద బల్క్ లైన్స్ రావాలి మరి అవేమీ లేవని అంటుంది. ఖుషి తల్లి నేను నిజంగానే నీకోసం బాధపడ్డాను గెస్ట్ లు ఉన్నారని వాళ్ళకి తెలియకుండా ఉండటం కోసం మేకప్ చేసుకున్నాను  అని మాళవిక చెప్తే లేదు నేను నమ్మను నువ్వు కూడా అబద్ధమే చెప్తున్నావ్.. నాకు ఏడిస్తే తెలిసిపోతుంది. అబద్ధం చెప్తే దేవుడు మనల్ని పనిష్ చేస్తాడు మీరు అబద్ధాలు చెప్పకండి అని ఖుషి వెళ్ళిపోతుంది.

Also Read: ఐ హేట్ యు అన్న ఆది - ముక్కలైన యష్ గుండె, పైశాచికానందం పొందిన మాళవిక, అభి

వేద ఖుషిని వెతుకుతూ ఉంటే ఖైలాష్ ఎదురుపడతాడు. షాక్ అయిన వేద నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ఇది నా ఇల్లు.. చెప్పాను కదా సిస్టర్ నన్ను ఒక దేవుడు విడిపించాడు, నాకు ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడని అది ఎవరో కాదు మీ ఆయన అభిమాన అభిమన్యు అని చెప్తాడు. తోడేలుకి నక్క తోడైంది అన్న మాట అని వేద కోపంగా అంటుంది. వేద అక్కడ నుంచి వెళ్లబోతుంటే ఖైలాష్ అడ్డుపడి తన మీదకి వెళ్ళబోతాడు. నీ కోసం తపిస్తున్నాను, నన్ను తాకి నాకు ప్రాణం పొయ్యవా వేదా అని అసహ్యంగా మాట్లాడేసరికి వేద ఖైలాష్ చెంప ఛెళ్లుమనిపిస్తుంది. టచ్ చేస్తే చంపేస్తాను అని వేద తిడుతుంది. అప్పుడే అక్కడకి ఖుషి వస్తుంది. నువ్వేంటి మావయ్య ఇక్కడ అని అడుగుతుంది ఖుషి. ఆదిత్య బర్త్ డే పార్టీ అని మీరందరూ వస్తుంటే నేను కూడా వచ్చానని చెప్తాడు.

యష్ ఆదిత్య కోసం వీడియో గేమింగ్ సెట్ తీసుకొచ్చానని చెప్పి తనకి ఇవ్వబోతాడు. కానీ ఆది మాత్రం అదేమీ పట్టించుకోకుండా వెయిటర్ ని పిలిచి వీళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు డ్రింక్స్ ఇవ్వు అని చెప్తాడు. యష్ మళ్ళీ బహుమతి ఇవ్వబోతుంటే డ్రైవర్ ని పిలిచి యష్ చేతిలోని గిఫ్ట్ అతనికి ఇచ్చేస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. నీ కోసం మీ నాన్న కొన్న స్పెషల్ గిఫ్ట్స్ అలా ఇస్తున్నావ్ ఏంటని వసంత్ అడుగుతాడు. నాదగ్గర ఇది ఆల్రెడీ ఉంది అభిమన్యు అంకుల్ ఇది లాంఛ్ అయినప్పుడే నా కోసం యూఎస్ నుంచి తెప్పించారని చెప్తాడు. అదేంటి నాన్న అలా ఇచ్చేశావ్ అని ఆదిని అడుగుతుంది మన దగ్గర ఉన్నదాన్ని లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని స్కూల్ లో మా టీచర్ చెప్పారు అందుకే ఆ గేమింగ్ నాదగ్గర ఉంది కదా అని ఇచ్చేశాను అని చెప్తాడు. ఆ మాటకి మాలిని ఈ వయసులోనే దానగుణం వచ్చింది చాలా గ్రేట్ అని మురిసిపోతుంది. కానీ పక్కకు వెళ్ళిన తర్వాత యష్ ని పిలిచి నాకోసం మీరు ఏం తెచ్చినా నాకు నచ్చదు ఇదే కాదు మీరు ఎప్పుడు ఏ గిఫ్ట్ తెచ్చిన డ్రైవర్స్ కి వాచ్ మెన్ కి ఇస్తాను తప్ప నాదగ్గర ఉంచుకోనని అంటాడు. ఆ మాటకి యష్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి.

Also Read: రాధ, మాధవ్ ల సవాల్- రుక్మిణి ఈ ఇంటి దేవత అంటోన్న దేవుడమ్మ

వేద ఖుషి సంతోషంగా మాట్లాడుకుంటూ వస్తుంటే మాళవిక ఎదురు పడుతుంది. నీకు, అన్నయ్యకి నేను మాత్రమే అమ్మని, ఈ వేద కాదని అంటుంది. మరి నువ్వే అమ్మవి అయితే నన్ను చిన్నప్పుడే ఇంట్లో ఎందుకు వదిలేసి వెళ్లిపోయావు, ఈ ఊర్లోనే ఉంటూ నన్ను చూడటానికి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, అన్నయ్య బర్త్ డే ని ఇంట పార్టీగా చేస్తున్నావ్ కదా  ఎప్పుడైనా నా బర్త్ డే ఇలా చేశావా? అసలు నా బర్త్ డే ఎప్పుడో నీకు తెలుసా? అని అడుగుతుంది. మాళవిక డేట్ ఎప్పుడంటే అని నీళ్ళు నములుతుంది. కానీ మా అమ్మకి తెలుసు, నాకు మా అమ్మంటే ఇష్టం అని చెప్తుంది.

కాంచన ఖైలాష్ ని కలుస్తుంది. వచ్చినప్పటి నుంచి నీ కోసమే వెతుకుతున్నాను అని చెప్తుంది. నేను ఈ ఇంట్లో ఉన్నట్టు ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దని అంటాడు. అప్పుడే అక్కడకి మాళవిక, అభిమన్యు వస్తారు. నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను అని మాళవిక కాంచనతో అంటుంది కానీ తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇక ఆది బర్త్ డే వేడుకలు స్టార్ట్ అవుతాయి. కేక్ కట్ చేసిన ఆది మొదట మాళవికకి తినిపిస్తాడు. తర్వాత యష్ తనకి తినిపిస్తాడని చాలా ఎదురు చూస్తాడు కానీ..    

Published at : 26 Aug 2022 08:10 AM (IST) Tags: Ennenno Janmalabandham Serial Today Episode Ennenno Janmalabandham Serial Ennenno Janmalabandham Serial Written Update Ennenno Janmalabandham August 26th

సంబంధిత కథనాలు

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

The Ghost: 'డబ్బు, సక్సెస్, సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది' - 'ది ఘోస్ట్' కొత్త ట్రైలర్!

Megastar Chiranjeevi: మరో రీమేక్‌పై చిరు ఫోకస్ - డైరెక్టర్ ఫైనల్ అయినట్లేనా?

Megastar Chiranjeevi: మరో రీమేక్‌పై చిరు ఫోకస్ - డైరెక్టర్ ఫైనల్ అయినట్లేనా?

Masooda Release Date : మూడు భాషల్లో సంగీత హారర్ డ్రామా 'మసూద' - విడుదలకు అంతా రెడీ

Masooda Release Date : మూడు భాషల్లో సంగీత హారర్ డ్రామా 'మసూద' - విడుదలకు అంతా రెడీ

HariHara Veeramallu: 'నవరాత్రులలో నవ ఉత్తేజం' - పవన్ లుక్ అదిరిపోయింది!

HariHara Veeramallu: 'నవరాత్రులలో నవ ఉత్తేజం' - పవన్ లుక్ అదిరిపోయింది!

Viral Video: అసభ్యకరంగా తాకిన అభిమాని, చెంప చెళ్లుమనిపించిన హీరోయిన్

Viral Video: అసభ్యకరంగా తాకిన అభిమాని, చెంప చెళ్లుమనిపించిన హీరోయిన్

టాప్ స్టోరీస్

Balka Suman Followers : మంచిర్యాల జిల్లాలో తుపాకీ బుల్లెట్లతో వాట్సప్ స్టేటస్లు | DNN | ABP Desam

Balka Suman Followers : మంచిర్యాల జిల్లాలో తుపాకీ బుల్లెట్లతో వాట్సప్ స్టేటస్లు | DNN | ABP Desam

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

Ponniyin Selvan Review - 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?

ప్లాస్టిక్ నుంచి డైమండ్స్ తయారీ, శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!

ప్లాస్టిక్ నుంచి డైమండ్స్ తయారీ, శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!

RBI Repo Rate Hike: సామాన్యుడిపై వడ్డీల పిడుగు- మరోసారి రెపో రేటు పెంపు!

RBI Repo Rate Hike: సామాన్యుడిపై వడ్డీల పిడుగు- మరోసారి రెపో రేటు పెంపు!