అన్వేషించండి

Devatha August 24th Update: రాధ, మాధవ్ ల సవాల్- రుక్మిణి ఈ ఇంటి దేవత అంటోన్న దేవుడమ్మ

రుక్మిణి దేవుడమ్మ ఇంట్లో జరుగుతున్న బారసాల వేడుకకి వస్తుంది. మాధవ్ కూడా వచ్చి రాధని ఇరికించేందుకు ప్రయత్నిస్తాడు.

ఇప్పుడే ఇక్కడే నువ్వు వాళ్ళకి కావాల్సిన వ్యక్తివని వాళ్ళకి చెప్పేయ్యాలని ఉంది కానీ దేవిని చూసి ఆగాల్సి వస్తుంది, దేవికి నా మీద అనుమానం వచ్చిందంటే నేను వేసిన ప్లాన్ అంతా పాడైపోతుంది. నా మాట విని నాతో పాటు ఇంటికి వచ్చేసేయ్ అని మాధవ్ రాధని బెదిరిస్తాడు. రాధ కారు దగ్గర ఉంటుంది. అక్కడికి వచ్చిన మాధవ్ ఏంటి రాధ మనం ఇద్దరం కలిసి వెళ్దామని ఎదురు చూస్తున్నావా అని అంటాడు. 'నీ నీడ మీదే కాలు వేయడానికి మనసు రాదు గసువంటిది నీతో వస్తానా, మా అత్తమ్మ ముంగట ఏం మాట్లాడను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు రోల్లినవ్ ఏంటి అందరి ముంగట నా ముసుగు తీస్తావా నా బిడ్డతో నువ్వే తన నాయనవని చెప్పిస్తావా మా అత్తమ్మ గుండెలు పగిలేటట్టు చేస్తావా? మా అత్తమ్మ గుండె కాదు అంత దాకా వస్తే నీ తల పగిలిద్ది. నీ కళ్ళతో నువ్వే చూశావ్ చెవులారా విన్నావ్ కదా నా ఇంట్లో నా బిడ్డ ఎంత సంతోషంగా ఉందో నా వాళ్ళు నా బిడ్డని ప్రాణం లెక్క ఎట్లా చూసుకుంటున్నారో బెదిరించి భయపెట్టి బాధపెట్టి రక్త సంబంధాన్ని విడదియ్యలేవు సారు’ అని రాధ కోపంగా అంటోంది.

Also Read: తులసి, సామ్రాట్ గురించి నీచంగా ఆర్టికల్- రచ్చ చేసిన అభి, అనసూయ బుర్రలో విషం నింపిన నందు, లాస్య

అత్తగారి ఇంటికి వచ్చేసరికి చాలా మాటలు వచ్చేస్తున్నాయని మాధవ్ అంటే అవును నా అత్త ఇల్లు అంటే నా ఇల్లు. నువ్వు ఎన్ని కథలు పడినా నేను ఈరోజు ఇక్కడిదాకా వచ్చాను అంటే రేపు నా బిడ్డని ఈ ఇంటికి పంపించలేనా నువ్వు చూస్తా ఉండు నా బిడ్డని వాళ్ళ నాయన దగ్గరకి ఎలా పంపిస్తానో అని రాధ సవాల్ చేస్తుంది. ఆ ఆదిత్యాది నీదు ఒకటే మాట పదేళ్ళు గడిచిపోయినా మనుషుల్లోనే కాదు మాటల్లో కూడా ఏ మాత్రం తేడా లేదు ఆదర్శ దంపతులన్నమాట, ఇందాక మీ అత్తయ్య ముందు అలా మాట్లాడినప్పుడు నువ్వు ఎంత వణికిపోయావో నాకు తెలుసు, అందరి ముందు నీ నిజ స్వరూపం చూపించాలని ఆవేశపడి కూడా ఎందుకు ఆగానో తెలుసా ఆదిత్య, నువ్వు బాగా తెగించారని అర్థం అయ్యింది అందుకే డీల్ చేయాల్సిన పని ఇది కాదని ఆగిపోయాను అని అంటాడు. నేను ఈరోజులా సైలెంట్ గా ఉన్నానని అనుకోకు తట్టుకోలేవు అని హెచ్చరిస్తాడు మాధవ్.

దేవుడమ్మ రుక్మిణి ఫోటో చూసుకుంటూ బాధపడుతుంది. మీ అక్క బిడ్డకి ఎంత ఘనంగా బారసాల ఏర్పాటు చేశానో అదే నీ బిడ్డ ఉంటే ఇంకెంత ఘనంగా చేసేదాన్నో అని ఏడుస్తుంది.  నిన్ను మర్చిపోలేక కమల బిడ్డకి రుక్మిణి అని నీ పేరే పెట్టుకున్నాను కానీ మన ఇంటి వారసుడో, వారసురాలో ఉంది ఉంటుంది వాళ్ళకి ఏం పేరు పెట్టావో నాకు తెలియదు, నిన్ను మరచిపోవడం ఈ జన్మలో జరగదు అని బాధపడుతూ మాట్లాడుతూ ఉంటే భాగ్యమ్మ అవి వింటూ ఉంటుంది. దేవి ఇంటికి వెళ్తాను అని అంటే దేవుడమ్మ నువ్వు ఈ ఇంటి పెద్ద మనవరాలివి అప్పుడే వెళ్తావా అని అడుగుతుంది. దేవుడమ్మ జానకికి చీర ఇచ్చి రాధకి ఇవ్వమని చెప్తుంది. మీకు మా రాధని చూపించే బాధ్యత నాది  అని జానకి మాట ఇస్తుంది. అది విని సత్య షాక్ అవుతుంది. జానకి దేవుడమ్మ ఇచ్చిన చీర చూస్తూ ఉంటే అది చూసి మాధవ్ రగిలిపోతాడు.

Also Read: యష్ ని ఘోరంగా అవమానించిన కొడుకు ఆదిత్య- తల్లడిల్లిన తండ్రి మనసు

దేవుడమ్మ కమల వాళ్ళతో మాట్లాడుతుంది, రుక్మిణి పేరు పెట్టినందుకు మీరు ఏమనుకుంటున్నారో అని అంటుంది. అనుకోడానికి ఏముంది అంటా మంచిగానే చేశారు కదా నేను కూడా రుక్మిణి పేరు పెట్టాలని అనుకున్నా కానీ నా చెల్లిని గుర్తు చేసుకుని మీరు ఎక్కడ బాధపడతారో అని అనుకున్నామని కమల చెప్తుంది. ఈ ప్రాణం పోయేంత వరకు రుక్మిణిని మర్చిపోవడం  జరగదని దేవుడమ్మ అంటుంది. దాని పేరు పెట్టి రుక్మిణి నా కళ్ల ముందే ఉందని ఆనందపడుతున్నా అని చెప్తుంది. రుక్మిణి ఆదిత్యతో తన సంతోషాన్ని పంచుకుంటుంది. ఈ పొద్దు నేను నా వాళ్ళందరిని చూశాను వాళ్ళ దగ్గరకి వచ్చాను అని సంతోషపడుతుంది. దేవి అలా సరదాగా తిరుగుతూ ఉంటే అందరూ తన మీద ప్రేమ చూపించడం చూసి దేవికి నేనేం మీ నాన్నని అని చెప్పాలని అనిపించింది అని ఆదిత్య బాధపడతాడు.

టాప్ హెడ్ లైన్స్

Goodachari 2 Release Date : అడివి శేష్ గూఢచారి 2 రిలీజ్ డేట్ ఫిక్స్! - అవెయిటెడ్ స్పై థ్రిల్లర్ వచ్చేది ఎప్పుడంటే?
అడివి శేష్ గూఢచారి 2 రిలీజ్ డేట్ ఫిక్స్! - అవెయిటెడ్ స్పై థ్రిల్లర్ వచ్చేది ఎప్పుడంటే?
CM Vijay Vs Vijay Sethupathi: సీఎం విజయ్‌ను టార్గెట్ చేసిన సేతుపతి... 'బిగ్ బాస్' కామెంట్స్‌పై ఛానల్ క్లారిటీ
సీఎం విజయ్‌ను టార్గెట్ చేసిన సేతుపతి... 'బిగ్ బాస్' కామెంట్స్‌పై ఛానల్ క్లారిటీ
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో: కంటెండరైన ముకేశ్.. కొట్టుకున్న షాలిని, అమన్! కారణం ఆ టీమేనా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో: కంటెండరైన ముకేశ్.. కొట్టుకున్న షాలిని, అమన్! కారణం ఆ టీమేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా గొంతు నలిపేసిన సహస్ర! క్రిష్‌ ఫుడ్‌ లాక్కొని బెడ్ తడిపేసిన బంటీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా గొంతు నలిపేసిన సహస్ర! క్రిష్‌ ఫుడ్‌ లాక్కొని బెడ్ తడిపేసిన బంటీ!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu In Tirumala: వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
వేంకటేశ్వర స్వామివారి కృపతోనే ప్రాణాలతో ఉన్నా.. తిరుమలలో సీఎం చంద్రబాబు భావోద్వేగం
Viral News: విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
విశాఖలో రోడ్డు పక్కన కుప్పలుగా పడి ఉన్న చిరిగిన కరెన్సీ నోట్లు 
AP Police Recruitment: ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీలో పోలీస్ కొలువులు.. 2050 ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
గత నెలలో ప్రజలు ఈ కార్ల కోసమే షోరూమ్‌ల ముందు క్యూ కట్టారు.. టాప్‌-10 కార్ల లిస్ట్‌
ఆగస్టులో దేశవ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ డిమాండ్.. టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ లిస్ట్‌ మీ కోసం
Navya Swamy: ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
ఫ్యామిలీతో నవ్య స్వామి వినాయక చవితి సెలబ్రేషన్స్... వైరల్ ఫోటోలు
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
Embed widget