అన్వేషించండి

Gruhalakshmi August 23 Update: తులసి, సామ్రాట్ గురించి నీచంగా ఆర్టికల్- రచ్చ చేసిన అభి, అనసూయ బుర్రలో విషం నింపిన నందు, లాస్య

గృహలక్ష్మి తులసి జీవితంలోకి సామ్రాట్ రావడంతో రోజుకో మలుపు తిరుగుతోంది కథ. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

శ్రుతి ఇంటికి వస్తుంది. తాతయ్య ఎలా ఉన్నారు ప్రమాదం ఏమి లేదు కదా అని అడుగుతుంది. కనీసం ఈ వంకతో అయినా నన్ను చూడటానికి వచ్చావ్ సంతోషంగా ఉందమ్మా అని పరంధామయ్య అంటాడు. నా మొహం కూడా చూడటానికి ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు ఎందుకు వచ్చింది అందరి ముందు నా పరువు తియ్యాలని అనుకుంటుందా అని ప్రేమ మనసులో అనుకుంటాడు. నీ చేతి కాఫీ తాగాలని అనిపిస్తుందని పరంధామయ్య అంటే నేను మాత్రం చిన్న కోడలి చేతి కాఫీ మీద దిగులు పెట్టుకున్నాను కలిపిస్తావా అని తులసి అడుగుతుంది. అలాగే ఆంటీ అని శ్రుతి వెళ్ళిపోతుంది. నందు, లాస్య బయట ఉన్న దగ్గరకి అనసూయ వస్తుంది. ఎందుకు బయటకి రమ్మని పిలిచావని అడుగుతుంది. మీ పక్కన ఉన్న తులసి చేసే తప్పులు అసలు కనిపించడం లేదా అని లాస్య అంటుంది. మళ్ళీ తులసి మీద నిందలు వెయ్యడం మొదలు పెట్టారా.. తులసి నిప్పులాంటిది అని అనసూయ తిడుతుంది.

సామ్రాట్, తులసి క్లోజ్ గా ఉన్న ఫోటోస్ లాస్య అనసూయకి చూపిస్తుంది. ఆ ఫోటోలో ఉంది తులసి కాదు కదా అని వెటకారంగా అంటుంది. తులసిని సామ్రాట్ తో వైజాగ్ పంపించొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పాను నా మాట వినకుండా హారతి ఇచ్చి మరి పంపించావ్ చూశావ్ గా అక్కడ వాళ్ళ నిర్వాకం.. మేము కూడా వాళ్ళతో ఉన్నామని స్పృహ కూడా లేకుండా బరి తెగించి తిరిగారు. ఇప్పుడు వైజాగ్ తీసుకెళ్ళాడు తర్వాత ఆఫీసు పని అని బెంగళూరు తీసుకెళతాడాని నందు అంటే ఆ తర్వాత హనీ మూన్ కి కూడా వెళ్తారు. అయినా సరే తులసి మీ దేవత అనుకుంటే చేసేది ఏమి లేదని నందు అంటాడు. నీ వెనకాల ఏం జరుగుతుందో ఇప్పటికైనా తెలుసుకోమని నందు, లాస్యలు విషం నింపేందుకు ప్రయత్నిస్తారు.

Also Read: మోనిత వచ్చేసిందోచ్ - డాక్టర్ బాబు కోసం వెతుకులాట, దీపకు ఊహించని షాక్

హనీ ఇంట్లో వాళ్ళ మీద నీళ్ళు పోస్టు సరదాగా ఆడుకుంటూ ఉంటుంది. చూసుకోకుండా సామ్రాట్ మీద కూడా నీళ్ళు పోసేస్తుంది. అది చూసి అందరూ భయపడతారు. కానీ సామ్రాట్ మాత్రం హనీ మీద నీళ్ళు పోస్తూ తనంతో బాగా అడుకుంటాడు. ప్రేమ్, శ్రుతి పాటల పోటీలో గెలిచిన బహుమతి చూస్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ బహుమతి ప్రేమ్ జీవితాన్ని మార్చేసిందని తులసి అంటే ప్రేమ్ జీవితాన్ని మార్చడం కాదు ఆంటీ ప్రేమ్ నే మార్చేసింది, తన మనసులో నా మీద ఉన్న ప్రేమని చంపేసింది నాకు దూరం చేసిందని శ్రుతి మనసులో అనుకుంటుంది. నువ్వు లేవని ప్రేమ్ మనసులో ఎంత దిగులు పెట్టుకున్నాడో అని తులసి అంటుంది. నీకు వాడిని చూడాలని అనిపించలేదా అని తులసి అడుగుతుంది. శ్రుతి వెళ్తాను అంటే అదేంటి ఉండటానికి రాలేదా అని తులసి అడుగుతుంది. లేదని తల ఊపుతుంది. ఇంతక ముందులా నువ్వు హుషారుగా లేవని పరంధామయ్య తులసి అంటారు. ఏదైనా సమస్య ఉందా అని తులసి అడుగుతుంది. మొహమాటం లేకుండా చెప్పమని అడుగుతుంది. శ్రుతి మాత్రం మౌనంగా ఉంటుంది.

మన తెగతెంపుల విషయం బయట పెట్టడానికి ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నాడు అని శ్రుతి మనసులో అనుకుంటుంది. వాళ్ళ అత్తయ్యతో తులసి మాట్లాడుతుంది నువ్వు ఇక్కడే ఉండిపో అని తులసి, పరంధామయ్య చెప్తారు. బట్టలు లేవంటే ప్రేమ్ వెళ్ళి తీసుకొస్తాడని తులసి చెప్తుంది. మనసులో భయాలన్నీ పక్కన పెట్టి ఇక్కడే ఉండు అని చెప్పడంతో సరే అంటుంది.

Also Read: నువ్వెవరో తెలియదన్న కార్తీక్, ఇన్విస్టిగేషన్ ప్రారంభించిన దీప, మోనిత ఎంట్రీకి టైమ్ వచ్చేసింది

తులసితో సామ్రాట్ బీచ్ లో తిరిగిన విషయం మీద సోషల్ మీడియాలో నీచంగా రాస్తూ ఆర్టికల్ వస్తుంది. దాన్ని సామ్రాట్ బాబాయ్ తనకి చూపిస్తాడు. ఒక ఆడ మగ కలిసి ఉంటే ఇలా రాస్తారా అని సామ్రాట్ కోప్పడతాడు. ఈ న్యూస్ గురించి తులసి ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలియదని అంటాడు. తన మ్యూజిక్ స్కూల్ ఆగిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యాలని సామ్రాట్ టెన్షన్ పడతాడు. అదే ఆర్టికల్ ని అభి పరంధామయ్యకి చూపిస్తాడు. మామ్ ని వైజాగ్ వెళ్లనివ్వవద్దని డాడ్ చెప్తే పట్టించుకోలేదు ఈ ఆర్టికల్ తో మన పరువు బజారున పడిందని అభి అరుస్తాడు. బయటకి వెళ్తే అందరూ ఈ ఆర్టికల్ గురించే మాట్లాడుకుంటున్నారని అంటాడు. మామ్ ని తప్పు పడుతున్నావా అని దివ్య అంటుంది. నీకు అమ్మ మీద నమ్మకం లేదా అని ప్రేమ్ అడుగుతాడు. నీకు అమ్మ మీద నమ్మకం ఉంటే ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదని ప్రేమ్ అంటాడు. నానమ్మ నువ్వు కూడా మామ్ ని సపోర్ట్ చేస్తున్నావా అని అనసూయని అడుగుతాడు.

తరువాయి భాగంలో..

సామ్రాట్ తులసి ఇంటికి వచ్చి తనతో పర్సనల్ గా మాట్లాడాలని అంటాడు. ఏం మాట్లాడాలన్నా మా ముందే మాట్లాడొచ్చు మామ్ కూడా ఏమి అనుకొదని అభి అంటాడు. సామ్రాట్ సోషల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్ ని తులసికి చూపిస్తాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Satirical Song On Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
అల్లు అర్జున్‌ను తిడుతూ పాట... శవాల మీద పేలాలు ఏరుకోవడమా?
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Bumrah Record Alert: బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
బుమ్రా అరుదైన ఘనత, 200 టెస్ట్ వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ - అత్యంత వేగంగా చేరిన భారత పేసర్ గా రికార్డు
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, మంటలు చెలరేగి 85 మంది మృతి
Pawan Kalyan OG: పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
పవన్‌ను ఇబ్బంది పెట్టకండ్రా... టైముంది... థియేటర్లలో అల్లాడిద్దాం - ఫ్యాన్స్‌కు 'ఓజీ' టీమ్ రిక్వెస్ట్
BRS MLC Kavitha: జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
జైలు నుంచి వచ్చాక తొలిసారి ఇందూరుకు కవిత, గజమాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం
Telangana Income: కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
కాంగ్రెస్ పాలన తొలి ఏడాదిలోనే ఖజానాకు తగ్గిన ఆదాయం - బీఆర్ఎస్‌ చేతికి మరో అస్త్రం
Embed widget