Karthika Deepam Serial ఆగస్టు 22 ఎపిసోడ్: నువ్వెవరో తెలియదన్న కార్తీక్, ఇన్విస్టిగేషన్ ప్రారంభించిన దీప, మోనిత ఎంట్రీకి టైమ్ వచ్చేసింది
Karthika Deepam August 22 Episode 1437: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కారు ప్రమాదంలో చనిపోయారు అనుకున్న వంటలక్క, డాక్టర్ బాబు బతికే ఉన్నారు...
కార్తీకదీపం ఆగస్టు 22 సోమవారం ఎపిసోడ్ (Karthika Deepam August 22 Episode 1437)
దీప...కార్తీక్ ఫోటో పట్టుకుని అందర్నీ అడుగుతూ ఉంటుంది. డాక్టర్ బాబుని కార్లో తీసుకొచ్చిన డ్రైవర్.. శివ దగ్గరికి వచ్చి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూశావా అని అడిగితే లేదంటాడు శివ. బయటకు వెళ్లి మిగిలిన వాళ్ళని అడుగుతుంది దీప.ఈ లోగ శివ, కార్తీక్ నీ వెంటనే కారులోకి కంగారుగా ఎక్కించేస్తాడు. ఎందుకయ్యా నన్ను ఇంత త్వరగా తీసుకెళ్లి పోతున్నావు అని కార్తీక్ అడిగితే మేడం రమ్మంటున్నారు సార్ అని చెబుతాడు. కార్తీక్ అటు వెళ్లిపోగానే లోపలకు వెళ్లిన దీప..ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూశారా అని అడిగితే ఇప్పుడే లోపల జ్యూస్ తాగుతున్నారని చెబుతాడు. సంతోషంగా ఉన్న దీప లోపలకు పరిగెత్తుతుంది కానీ అప్పటికే కార్తీక్ వెళ్లిపోతాడు. ఇంత దగ్గరగా తీసుకొచ్చి మళ్లీ దూరం చేశావెందుకు అని ఏడుస్తుంది..
Also Read: డాక్టర్ బాబు-దీప ఎవరంటూ షాక్ ఇచ్చిన కార్తీక్, ఇప్పుడు వంటలక్క ఏం చేయబోతోంది!
సెకెండ్ షో సినిమాకు వెళదాం పద అని ఇంద్రుడు, చంద్రుడు శౌర్యని అడుగుతారు. తనకు రావాలని లేదని చెబుతుంది శౌర్య. శుక్రవారం సెకండ్ షో సినిమాకి వెళ్లకపోతే మాకు ముద్ద దిగదు బంగారం అంటారు. ప్రతిదానికి వద్దు అంటే వీళ్ళు బాధపడతారు, ఇష్టం లేకపోయినా వెళ్లాలి అని శౌర్య మనసులో అనుకుని సరే వెళదాం అంటుంది. మరోవైపు దీప బయట కూరగాయలు కొంటూ ఉంటుంది. ఆ వెనుకే శౌర్య, ఇంద్రుడు, చంద్రుడు బట్టల షాపు దగ్గరుంటారు. ఆ వెనుక కార్తీక్, శివ నడుచుకుంటూ వస్తారు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్ అని శివ అడిగితే ఇక్కడ బిర్యానీ బావుంటుంది..మీ మేడంకి చెబితే బిర్యానీ వద్దు ఇంట్లో కూర్చోండి అంటుంది అందుకే చెప్పకుండా వచ్చానంటాడు. కార్తీక్ గొంతువినగానే దీప వెనక్కు తిరిగి చూస్తుంది. డాక్టర్ బాబు! డాక్టర్ బాబు! అని కార్తీక్ దగ్గరకు వెళుతుంది కానీ..ఎవరు మీరు..తప్పుగా అనుకుని ఉంటారు అంటాడు.
దీప: నేను దీపని మీ వంటలక్కను మర్చిపోయారా
కార్తీక్: ఎవరో అనుకుని మీరు నాతో మాట్లాడుతున్నారు
పక్కనే ఉన్న శివ..ఎవరో పిచ్చిదై ఉంటుంది లెండి అన్న శివని చూస్తుంది. ( సాయంత్రం ఫొటో చూపించి ఈ వ్యక్తి తెలుసా అంటే తెలిదయని చెప్పిన విషయం గుర్తుచేసుకుంటుంది) . తెలిసి కూడా తెలియదని చెప్పారంటే ఇక్కడేదో తప్పు జరుగుతోందన్నమాట..అసలేం జరుగుతోంది..నా భర్తను ఏం చేస్తున్నారని నిలదీస్తుంది..
శివ: పిచ్చోళ్లు సార్.. డబ్బులు కోసం ఈమధ్య ఇలాంటి ఒక కొత్త నాటకం మొదలుపెట్టారని చెప్పి కార్తీక్ ని తీసుకెళ్లిపోతాడు.
అప్పుడు దీప కళ్ళు తిరిగి పడిపోతుంది.
Also Read: రిషి చేయించిన రింగ్ మెడలో వేసుకున్న వసు, మళ్లీ రంగంలోకి దిగిన దేవయాని-సాక్షి
దీప కళ్లు తెరిచేసరికి సీన్లో దీప తిరిగి ఇంటికి వచ్చి తనకు వైద్యం చేసిన డాక్టర్ తో, అన్నయ్య ఇందాక డాక్టర్ బాబును చూసాను కానీ అతను నన్ను గుర్తు పట్టట్లేదు అంటూ ఏడుస్తూ చెప్తుంది.
డాక్టర్: నువ్వు చూసింది కచ్చితంగా కార్తీక్ నేనా?
దీప: నా డాక్టర్ బాబుని నేను పోల్చుకోలేనా
డాక్టర్: నీ భర్తే అయితే తెలియనట్టు ఎందుకుంటారు..నువ్వు చూసినట్టే నీకోసం అతను కూడా ఎదురుచూడాలి కదా
దీప: మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అలాగని డాక్టర్ బాబు కాదనుకుందాం, మరి ఆ పక్కనున్న అతను ఎందుకు మధ్యాహ్నం అయన ఫోటో ఇస్తే తెలీదు అని చెప్పారు. అయితే ఇక్కడ ఏదో జరుగుతుంది
డాక్టర్: ఇన్నాళ్లూ ఉన్నారో లేదో అనుకున్నావ్..ఇప్పుడు ఉన్నారని తెలిసింది కదా ఏం జరిగిందో కనుక్కుందాం.. నీ భర్త అయితే నీకు దక్కుతాడు కాకపోతే మళ్లీ వెతుకుదాం..అంతేకానీ పిరికిదానిలా మాట్లాడొద్దు..నిజానిజాలు తెలిసేవరకూ ధైర్యంగా ఉండు.
ఇంతట్లో దీప క్యాలెండర్ చూడగా ఆగస్టు 22 అని ఉంటుంది. అప్పుడు దీప ఏడుస్తూ తన పెళ్లి జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని డాక్టర్ అడిగితే ఈరోజు మా పెళ్లి రోజు అన్నయ్య అని చెప్పి అంత ప్రేమగా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు నేను అంటే కూడా ఎవరో తెలీదు అన్న స్థితిలోకి వచ్చేసారు అని ఏడుస్తుంది.
ఎపిసోడ్ ముగిసింది