By: ABP Desam | Updated at : 20 Aug 2022 09:33 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu August 20 Episode 534 (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంతమనసు ఆగస్టు 20 శనివారం ఎపిసోడ్ (Guppedantha Manasu August 20 Episode 534)
రిషికి ఉంగరం ఎలా చేయించాలా అని ఆలోచిస్తోన్న వసుధారని పిలిచిన రిషి..బోర్డుపై ఉన్న ప్రాబ్లెమ్ సాల్వ్ చేయమని చెప్పి వసు సీట్లో కూర్చుంటాడు. వసు మాత్రం బోర్డుపై కూడా బంగారం గ్రాముల లెక్కలు వేస్తుంటుంది. స్టూడెంట్స్ అంతా ఆశ్చర్యంగా చూస్తుంటే వసుధారా ఏం రాస్తున్నావ్ అని మండిపడతాడు రిషి. ఉలిక్కి పడిన వసు సార్ అది అని చెరిపేలోగా ఏయ్ ఆగు..నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటి..ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు..
వసు: నసుగుతూ ఉంటుంది
రిషి: అందరి ముందూ అరిస్తే డిస్టబ్ అవుతుందనుకుంటూ సరే వెళ్లు అనేస్తాడు..
రిషిని చూస్తూ వెళ్లి సీట్లో కూర్చుంటుంది..ఏంటిలా చూస్తోంది అనుకుంటాడు రిషి. ఇంతకీ ఆ లెక్కలేంటో అర్థంకాలేదనుకుంటాడు.
అటు జగతి మహేంద్ర క్యాబిన్లో కూర్చుంటారు. కార్లో జరిగిన సంఘటన తలుచుకుని నవ్వుకుంటాడు. ఇంతలో గౌతమ్ అక్కడకు వస్తాడు. డ్రైవింగ్ చేస్తే బాగుంటుంది అని కాసేపు డ్రైవింగ్ గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత గౌతమ్ ఇవాళ రిషి మూడ్ ఎలా ఉందో అని అడుగుతుండగా దానికి మహేంద్ర..వెదర్ రిపోర్ట్ చెబుతాడు. వర్షం కురుస్తుందని చెప్పగలం కానీ రిషి మూడ్ ఎలా ఉందో చెప్పలేం అంటాడు. రిషి కాలేజీకి ఎండీ..ఆ విషయం మీరు గుర్తుంచుకుంటే మంచిందంటుంది జగతి. కాలేజీ ఫైనల్ ఎగ్జామ్స్ అవబోతున్నాయ్ రిషి ఆ టెన్షన్లో ఉన్నాడు మనం కూడా ఆ విషయంలో రిషికి హెల్ప్ చేస్తే మంచిందంటుంది...
ఇంతలో వసుధార అట్నుంచి నడిచివెళ్లిపోతుంటే గౌతమ్ పిలుస్తాడు కానీ వినిపించుకోదు...ఏదో ఆలోచించుకుంటూ వెళ్లిపోతుంది. పిలిచినా పలకడంలేదేంటి..వీళ్లు మళ్లీ ఏమైనా గొడవపడ్డారా అని గౌతమ్ అంటే..ఎక్కువ ఆలోచించవద్దు మనకు మీటింగ్ ఉందని వెళుతున్న మహేంద్రని ఆపుతుంది. నేను వసుధారతో మాట్లాడుతాలెండి అంటాడు గౌతమ్.
Also Read: డాక్టర్ బాబు-దీప ఎవరంటూ షాక్ ఇచ్చిన కార్తీక్, ఇప్పుడు వంటలక్క ఏం చేయబోతోంది!
వసు లెక్కల గురించి జగతికి చెప్పిన రిషి..మీటింగులో రిషి ఎగ్జామ్ గురించి చెప్పి అందరిని చక్కగా తీర్చిదిద్దాలి అని సలహా ఇస్తాడు. మీటింగ్ పూరైన తర్వాత జగతిని ఉండమని చెబుతాడు.
రిషి: ఎగ్జామ్స్ వస్తున్నాయ్..వసుధారలో మునుపటి శ్రద్ధ కనిపించడం లేదు..ఏదో విషయం గురించి ఆలోచిస్తోంది ఏవో లెక్కలు వేస్తోంది..తను శ్రద్ధ పెట్టించేలా చూడండి
జగతి: సరే సార్
రిషి: సార్ అనకండి మేడం
జగతి: సరే రిషి..వసుకి ఏం చెప్పాలి
రిషి: తను ఈ కాలేజీకి గౌరవం తెచ్చింది..ఇంతకుముందులా ఏకాగ్రత లేదు..తను ఓ యూత్ ఐకాన్.. గ్రాము అంటుంది ఇంకేదో అంటుంది..తన లక్ష్యం, తన భవిష్యత్ ఏమవుతుంది చెప్పండి..
జగతి: సార్ అది..అని ఆగి..రిషి..యూత్ ఐకాన్ కన్నా ముందు సగటు ఆడపిల్ల..జీవితంలో తనకంటూ కొన్ని ఆలోచనలు ఊంటాయి కదా..లైఫ్ లో టార్గెట్ ముఖ్యమే కానీ లైఫ్ అంతకన్నా ముఖ్యం అని అనుకుంటుందేమో...
రిషి: మేడం..తను అనుకున్న లక్ష్యం యూనివర్శిటీ టాపర్ అవ్వాలి..తను కోరుకున్న రీతిలో పాసవ్వాలంటే బాగా చదవాలి.. అది మీరైనా తనకి చెప్పండి..
జగతి: లెక్చరర్ గానో, వసు టీచర్ గానో కాకుండా..తన మనసు తెలిసినదానిలా ఓ మాట చెబుతున్నాను.. వసు ఎంత గొప్ప స్టూడెంట్ అయినా ఆడిపల్లే కదా..అమ్మాయిలకు జీవితంపై ఆశలుంటాయి కదా..ఆ విషయంలో తను డిస్టబ్ అయిందేమో.. మనసులో ఓ సమస్య ఉన్నా, ఓ ఆలోచన ఉన్నా దానికి పరిష్కారం దొరికితేనే మనసుకి ప్రశాంతత ఉంటుందేమో.. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే..కరెక్ట్ అవొచ్చు కాకపోవచ్చు..వెళ్లొచ్చా రిషి...
రిషి: ఓకే అంటాడు..జగతి వెళ్లిపోయిన తర్వాత... వసు గురించి ఆలోచనలో పడతాడు..
ఆ తర్వాత గౌతమ్ మహేంద్ర దగ్గరికి వచ్చి వసు ఆలోచనలు కూడా రిషి లాగా అర్థం కాదు అనడంతో మహేంద్ర... వారిద్దరూ ఒకే గూటికి చెందిన వాళ్ళు కదా అని అంటాడు. ఇంతలో జగతి రావడంతో.. రిషి ఏం మాట్లాడాడని అడిగితే..తర్వాత చెప్పొచ్చా అంటుంది. ఇంకా రిషి రాలేదేంటని కాల్ చేస్తాడు మహేంద్ర..గౌతమ్ తో మీరు వెళ్లండని చెబుతాడు. ఆ తర్వాత వసుధార గురించి ఆలోచిస్తాడు..రెస్టారెంట్ కి వెళ్లి కలవాలనుకుంటాడు..
Also Read: రిషి కోసం ఎంగేజ్మెంట్ రింగ్ చేయించే పనిలో పడిన వసు, తల్లిపై ద్వేషం తగ్గించుకున్న రిషి
మళ్లీ కలసిన దేవయాని-సాక్షి
దేవయాని: తొందర పడ్డావు సాక్షి.. పెళ్లి చేసుకున్న తర్వాత రిషిని నీ వైపు తిప్పుకుంటే అయిపోయేది
సాక్షి: అంటే అన్నీ మరిచిపోయి రిషితో ఎప్పటిలా కలసి ఉండమంటారా
దేవయాని: అప్పుడు బంగారంలాంటి అవకాశం మిస్ చేసుకున్నావ్..రిషి కోసం ఇన్నాళ్లూ ఆరాటపడ్డావ్, ఎదురుచూశావ్, ఏదో పొరపాటున వి అక్షరం చేయిస్తే ...కాళ్లదాకా వచ్చిన అదృష్టం కాదనుకోవడం ఎందుకు. వసు-రిషి మధ్య ఏదో సాగుతోంది నీకూ తెలుసు నాకు తెలుసు..
సాక్షి: ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు
దేవయాని: అన్నిటికన్నా ముందు రిషిపై కోపాన్ని తగ్గించుకో..రిషిని నిన్ను కలిపే ప్రయత్నం ఇద్దరం కలసి చేద్దాం..
సాక్షి: నాకు దక్కని రిషిని ఎవ్వరికీ దక్కకుండా చేస్తాను..ఈ మాట నెరవేరాలంటే దేవయాని ఆంటీ చెప్పింది వినక తప్పదనుకుంటూ సరే ఆంటీ నన్నెందుకు రమ్మన్నారు..
దేవయాని: నువ్వేం చేయొద్దు అంతా నేను చూసుకుంటాను..చేసి చూపిస్తాను చూడు. ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వీళ్లు ఇప్పుడు ఎగ్జామ్స్ పై దృష్టి పెట్టారు..ఇద్దరి మధ్యా చనువు పెరగదు.. పరీక్షలు అయ్యేవరకూ వాళ్లకు వేరే ఆలోచనలు ఉండవు. అదును చూసి నువ్వు రంగ ప్రవేశం చేయాలి.నేను చెప్పినట్టు విను..చూస్తూ చూస్తూ రిషిని వసుధారకి వదిలేయకూడదు...
మరోవైపు రెస్టారెంట్ యజమానిని వసు ఏదని అడుగుతాడు..పర్మిషన్ తీసుకుని వెళ్లిపోయిందని చెప్పిన రెస్టారెంట్ యజమాని వసు డబ్బులు అడిగిందని చెప్పటంతో రిషి ఆలోచనలో పడి వసు దగ్గరికి బయలుదేరుతాడు. వసు తన రూమ్ లో ఆ రింగు ని చూస్తూ మురిసిపోతుంది. ఆ రింగుకు దారం కట్టి మెడలో వేసుకుంటుంది. అప్పుడే రిషి ఎంట్రీ ఇస్తాడు.
ఎపిసోడ్ ముగిసింది....
Guppedantha Manasu Promo: రిషిధార అభిమానులకు పండుగలాంటి ఎపిసోడ్.. రిషి వసు మధ్య సూపర్ సీన్!
Krishna Mukunda Murari November 28th Episode : ముకుంద ప్రేమలో మురారి.. భవాని పెళ్లి ప్రపోజల్ .. కృష్ణ పరిస్థితేంటి!
Bigg Boss Telugu 7: శివాజీతో అమర్‌దీప్ రాజకీయాలు, ఏం చేయాలో తెలియక శోభా ఏడుపు
Bigg Boss 7 Telugu: అర్జున్ స్ట్రాటజీ బెడిసి కొట్టనుందా? శివాజీని అనవసరంగా టార్గెట్ చేశాడా?
Bigg Boss 17: రూ.2 కోట్లు ఇస్తా, బిగ్ బాస్ నుంచి నన్ను బయటకు పంపేయండి - కంటెస్టెంట్ సీరియస్ కామెంట్స్
Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !
Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు
Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్ రాజ్
Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!
/body>