ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతి సప్తగిరులని తెలుసా.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతిలో ఏడు కొండలున్నాయి..వీటినే సప్తగిరులు అంటారు శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణప్రతీతి. (1) శేషాద్రి (2) నీలాద్రి (3) గరుడాద్రి (4) అంజనాద్రి (5) వృషభాద్రి (6) నారాయణాద్రి (7) వేంకటాద్రి పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమల గిరుల్లో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర