భారత బ్యాడ్మింటన్ యువ కెరటం లక్ష్యసేన్ అద్భుతం చేశాడు. ఇండియా ఓపెన్ పురుషుల సింగిల్స్ ఓపెన్ ఛాంపియన్‌గా అవతరించాడు.
ప్రపంచ ఛాంపియన్, సింగపూర్ షట్లర్ లోహ్ కీన్ యూను 24-22, 21-17 తేడాతో ఓడించాడు.
20 ఏళ్ల ఈ యువ ఆటగాడికి ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టైటిల్ కావడం ప్రత్యేకం.
తొలి గేమ్‌లో లక్ష్యసేన్, కీన్ నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. 2-2, 4-4, 6-6తో సమంగా దూసుకుపోయారు.
21-21, 22-22 వరకు ఇద్దరూ సమంగా పోరాడారు. 22 వద్ద ఒక పాయింట్ సేవ్ చేసుకున్న లక్ష్య గేమ్ పాయింట్‌కు చేరువయ్యాడు.
ఆ తర్వాత మరో పాయింటు సాధించి 24-22 గేమ్ గెలిచాడు.
రెండో గేమ్‌లో లక్ష్యసేన్ 20-17తో గేమ్‌తో పాటు మ్యాచ్ గెలిచేశాడు.