ప్రభాస్, యష్ లాంటి హీరోలు తమ సినిమాలతో పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కొంతమంది హీరోలు ఆ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. 'పుష్ప' సినిమాతో ఇప్పటికే పాన్ ఇండియా హిట్టు కొట్టారు బన్నీ. ఇకపై అన్నీ పాన్ ఇండియా సినిమాలే తీస్తారని టాక్. 'తుఫాన్' సినిమాతో ఇప్పటికే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా స్టార్ కావడం పక్కా. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ రావడం ఖాయం. విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న 'లెఫ్టినెంట్ రామ్' సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. డబ్బింగ్ సినిమాలతో నార్త్ ఆడియన్స్ కు దగ్గరైన అడివి శేష్ 'మేజర్'తో పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ కొట్టేయాలని చూస్తున్నారు. డబ్బింగ్ సినిమాలతో హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ 'ఛత్రపతి' రీమేక్ తో డైరెక్ట్ హిందీ రిలీజ్ కి రెడీ అవుతున్నాడు.