అన్వేషించండి

Jagadhatri Serial Today March 2nd:నిషిక చెంప చెళ్లుమనిపించిన జగధాత్రి..? అక్క ధాత్రికి నిషిక ఏం సవాల్ విసిరింది

Jagadhatri Serial Today Episode March 2nd: నిషిక చెంప చెళ్లుమనిపించిన జగధాత్రి..? అక్క ధాత్రికి నిషిక ఏం సవాల్ విసిరింది

Jagadhatri Serial Today Episode :  జగధాత్రి, కేదార్‌ లేకుండా ఈ ఎంగేజ్‌మెంట్ చేసుకోనని శ్రీవల్లి మొండికేస్తుంది.ముహూర్తం దాటిపోతుందని...వాళ్లు వచ్చేస్తుంటారే అని నిషిక చెప్పినా సరే శ్రీవల్లి ససేమీరా అనడంతో...కౌషికి వాళ్లు ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది.ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారని వైజయంతి చెప్పడంతో....ఫోన్‌ చేస్తాను ఉండంటూ కౌషికి ఫోన్ దగ్గరకు వెళ్తుంది. ఫోన్ స్విచ్ఛాప్‌ చేసి ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. ఛార్జింగా ఉన్నాగానీ ఫోన్ ఆగిపోయిందేంటని  అనుకుంటుంది.
 
ఫోన్ ఆన్ చేసి చూడగా....అప్పటికే జగధాత్రి చాలాసార్లు ఫోన్ చేసి ఉండటం చూసి తిరిగి ఆమెకు ఫోన్ చేస్తుండగా....అప్పుడే జగధాత్రి, కేదార్ ఇంటికి వస్తారు.ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లిపోయారని అడగ్గా....సురేష్‌ అన్నయ్యను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడంతో నిషిక, వైజయంతి, యువరాజులో ఆందోళన మొదలవుతుంది. తమ గుట్టు బయటపడుతుందేమోనని చాలా భయపడతారు. జగధాత్రి చెప్పిన మాటలకు కౌషికి షాక్‌ తింటుంది.సురేష్ ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారని అనగా...చాలాసేపటి నుంచి కనిపించడంలేదని సుధాకర్‌ చెబుతాడు. సురేష్‌ బావ ఇంట్లోనే ఉన్నాడని...ఇక్కడే అతన్ని దాచిపెట్టారని తెలుసుకుని ఇక్కడికి వచ్చామని కేదార్ చెప్పడంతో నిషిక, వైజయంతి ఇంకా భయపడతారు. వెంటనే ఆయన్ను వెతికి పట్టుకోకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదమని చెబుతాడు.
 
ఇంట్లో అందరూ సురేష్‌ కోసం వెతుకుతుంటారు.మనం కూడా వెతక్కపోతే అందరికీ అనుమానం వస్తుందని చెప్పి నిషిక, వైజయంతి, యువరాజు కూడా వెతుకుతారు. ఎంతసేపటికీ సురేష్ కనిపించకపోవడంతో ఇక పోలీసులకు ఫిర్యాదు చేద్దామని కౌషికి అంటుంది. సుధాకర్‌ను తీసుకుని పోలీసుస్టేషన్‌కు బయలుదేరుతుంది. వాళ్ల వెంట యువరాజు కూడా వెళ్తాడు. కానీ జగధాత్రికి సురేష్‌ను ఇంట్లోనే దాచిపెట్టారని తెలుస్తుంది.ఎలా అనిడితే...నిషిక నాకు చెప్పడానికి వచ్చినప్పుడు ఆమె కాళ్లు తడిచి ఉన్నాయని చెబుతుంది. వెంటనే అండర్‌గ్రౌండ్ వాటర్‌ ట్యాంక్‌ వద్దకు వెళ్తుంది.కేదార్ వచ్చి దాని మూత తీయగానే...అందులో సురేష్ ఉండటం చూసి అందరినీ పిలుస్తారు.
 
కేదార్‌, యువరాజు కిందకు దిగి సురేష్‌ను బయటకు తీసుకొస్తారు.అప్పటికే చాలాసేపటి నుంచి ఊపిరి ఆడకపోవడంతో సురేష్‌ స్పృహతప్పిపోతాడు.కేదార్ వెంటనే సీపీఆర్‌ చేసి అతన్ని బతికిస్తాడు. మెలువకలోకి వచ్చిన తర్వాత సురేష్‌ తనను వెనక నుంచి ఎవరో కొట్టిలోపల పడేశారని చెబుతాడు. అతనికి ఏం కాలేదు కదా ఇక ఇంట్లోకి వెళ్లిపోదామని వైజయంతి అందరినీ లోపలకి తీసుకెళ్తుంది.
నిషిక కూడా వెళ్లబోతుంటే....జగధాత్రి చేయిపట్టి ఆపి లాగిపెట్టి చెంపపై కొడుతుంది. నువ్వు అసలు మనిషివే కాదని తిడుతుంది. మీ పంతం కోసం ఒక మనిషి ప్రాణాలమీదకు తెస్తారా అని నిలదీస్తుంది. నాకేం తెలుసని నిషక అనగా...ధాత్రి గట్టిగా మండిపడుతుంది. శ్రీవల్లి ఎంగేజ్‌మెంట్ నుంచి మమ్మల్ని బయటకు పంపించడానికి మీరే సురేష్‌ను కిడ్నాప్ చేసి దాచిపెట్టారని నాకు తెలుసు అని అనగానే నిషిక షాక్‌కు గురవుతుంది. ఎందుకు ఇదంతా చేశావని నిలదీయగా...నీపై గెలవడమే నాకు ముఖ్యమని, అందుకు ఏమైనా చేస్తానని అంటుంది.
 
మన ఇంట్లో కుక్కినపేనులా పడి ఉండేదానివని...ఇప్పుడు ఇక్కడ రెచ్చిపోతుంటే నేను చూస్తూ ఊరుకోనని అందుకే నీమీద గెలవడం కోసం నేను ఏమైనా చేస్తానని నిషిక అంటుంది. మన సంగతి వదిలేయ్‌...మరి ఆ వచ్చిన పెళ్లికొడుకు ఫ్రాడ్‌ అని నీకు తెలిసి కూడా ఎందుకు శ్రీవల్లి గొంతుకోస్తున్నావ్‌ అని అనగా...అడ్డమైన వాళ్లకి ఆశ్రయం ఇవ్వడానికి ఇది ధర్మసత్రం కాదని...అందుకే దాన్ని పెళ్లి చేసి వెళ్లగొడుతున్నామని చెబుతుంది. ఇప్పుడు నీకు తెలిసిపోయింది కదా దమ్ముంటే ఆపుకోమని సవాల్‌ విసిరి వెళ్లిపోతుంది. ముహూర్తం దాటిపోవడంతో పంతులుగారు 10నిమిషాలు ఆగుదామని అంటాడు.ఇంతలో మీనన్‌ కౌషికి వాళ్ల ఇంటికి వస్తాడు. నేను బెదిరించినా కూడా కౌషికి భయపడకుండా ఇంట్లోనే ఎంగేజ్‌మెంట్‌ ఏర్పాట్లు చేసిందని...ఖచ్చితంగా ఈ ఇంట్లో ఎవరైనా చంపి దానికి నేనేంటో చూపిస్తానని అంటాడు. కౌషికి ఎంతో ఇష్టమైన  వాళ్ల బాబాయి సుధాకర్‌ను చంపడానికి గన్‌ తీసుకుని కౌషికి వాళ్ల ఇంటికి వస్తాడు. 

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 18th: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
నువ్వులేక నేను లేను: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
Podarillu Serial Today August 18th:పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
పొదరిల్లు: పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
Brahmamudi Serial Today August 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐషును రెచ్చగొట్టిన రేఖ – ఇందుతో చలపతి ఎమోషన్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐషును రెచ్చగొట్టిన రేఖ – ఇందుతో చలపతి ఎమోషన్‌
Gundeninda Gudigantalu August 18th:రోహిణి ఏటీఎం కార్డు లాక్కున్న ప్రభావతి..సుమతి ప్రేమ వ్యవహారం మీనాకు తెలిసిపోయిందా..?
గుండెనిండా గుడిగంటలు:రోహిణి ఏటీఎం కార్డు లాక్కున్న ప్రభావతి..సుమతి ప్రేమ వ్యవహారం మీనాకు తెలిసిపోయిందా..?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget