భోజనం ఎలా చేయాలి, ఎలా వడ్డించాలి, ఎలా తినాలి, ఎలా వండాలి అనే ప్రతి విషయాన్ని నియమ నిబంధనల ప్రకారం చెప్పారు పెద్దలు. అవేంటో చూద్దాం.



రోజుకి రెండుసార్లు భోజనం చేయాలని తైత్తరీయ బ్రాహ్మణం సెలవిస్తోంది
రెండుసార్ల మధ్యలో ఇంకేమీ తినకుండా ఉంటే ఉపవాస ఫలితం కూడా వస్తుందట



తూర్పువైపు తిరిగి భోజనం చేస్తే ఆయుష్షు
దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే కీర్తి
ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి



పడమర, దక్షిణం వైపు తిరిగి భోజనం చేయరాదని వామనపురాణం, విష్ణుపురాణంలో ఉంది
తూర్పు తిరిగి భోజనం చేయడం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా చెబుతున్నాయి



మను సంహిత ప్రకారం కుటుంబ పెద్ద తూర్పు ముఖంగా కూర్చుని భోజనం చేయాలి. భోజనానికి ముందు,తర్వాత కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.



అన్నం తినే కంచాన్ని ఎడమ చేతితో ముట్టుకోకూడదు. ఒకవేళ పొరపాటునా ముట్టుకుంటే, వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.



అన్నం తింటున్న సమయంలో ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు, తాకరాదు. అన్నం తినే సమయంలో ధ్యాస మొత్తం భోజనం మీదే ఉండాలి తప్ప వేరే విషయాలను ఆలోచించకూడదు.



భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాల్లో వెంట్రుకలు, పురుగులు వస్తే వెంటనే తినే దాన్ని విడిచిపెట్టాలి . కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు.



భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి. స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమం



పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం.



ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు,వడ్డించరాదు.



Images Credit: Pinterest