నీకు నీవే అధిపతివి- కృష్ణుడు చెప్పిన ఇంట్రెస్టింగ్ కొటేషన్స్



“మేఘం తొలగిపోయాక అక్కడే ఉన్న సూర్యుడిని చూసినట్లు.. అజ్ఞానం అంతరించిన తర్వాతే జ్ఞానం గోచరిస్తుంది”



”చావు పుట్టుకలు సహజం.. ఎవరూ దాన్ని తప్పించలేరు.. వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు”



”నీకు నీవే ఆప్తుడివి.. నీకు నీవే శత్రువువి.. నీకు నీవే ఇచ్చుకుంటే.. నీకు నీవే అధిపతివి..



”యోగమంటే ఇంకేమీ కాదు.. నీ కర్తవ్యాన్ని నీవు నైపుణ్యంగా నిర్వర్తించడమే”



నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది..



ఆత్మకు మరణం లేదు - శరీరమే మరణిస్తోంది. ఆత్మ మళ్లీ మళ్లీ జన్మలు తీసుకుంటోంది - పునరపి జననం - పునరపి మరణం!



నీ బాధ్యత మాత్రమే నీవు నిర్వర్తించు..అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంది.. ఫలితాల గురించి ఆలోచించకు.. అది నీ పని కాదు



లాభాల్లో, నష్టాల్లో, కష్టాల్లో, సుఖాల్లో నీ మనసును అటూ ఇటూ పరుగెత్తించకు.. సాధ్యమైనంతగా ప్రశాంతంగా ఉండు''



''మనిషిని సరైన దారిలోకి మళ్లించి.. కార్యోన్ముఖుడిని చేసే అంతరాత్మే ప్రతి ఒక్కరికి ముఖ్యం''



''ఉత్తములకు అవమానం వల్లనే గొప్ప భయం''



Images Credit: Pinterest