చాణక్య నీతి: ఇలా చేస్తే శత్రువైనా మీకు సలాం కొట్టాల్సిందే



ప్రతి ఒక్కరు వారివారి జీవితాల్లో పదవి హోదా, డబ్బు, గౌరవం కోసం పాకులాడుతుంటారు. కానీ వాటిని పొందే అర్హత ఉందో లేదో ప్రశ్నించుకోరు.



అదృష్టం కొద్దీ దక్కిన ఫలితం ఎక్కువ రోజులు ఉండదు..అర్హత ఉండాలని తెలుసుకోవాలి



హోదా, డబ్బు, గౌరవం గురించి చాణక్యుడు ఏం చెప్పాడంటే



తెలివి, జ్ఞానం ఉన్న వ్యక్తికి ప్రతిచోటా గౌరవం లభిస్తుంది. అందువల్ల వయసులో ఎదిగే ప్రతిదశలోనూ వీలైనంత జ్ఞానాన్ని సంపాదించేందుకు ప్రయత్నించాలి.



జ్ఞానాన్ని పెంచుకోవడమే కాదు ఆ జ్ఞానాన్ని పంచుకోవడం కూడా ముఖ్యం. ఇలా ఉంటే శత్రువులు కూడా గౌరవిస్తారు.



ఓ వ్యక్తి నిజాయితీ, సంస్కారవంతంగా ఉంటే.. అతడిపై ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సాధ్యం కాదు. కరుడుగట్టిన శత్రువు కూడా మిమ్మల్ని ఏం చేయలేరు..మీ ప్రతిష్టను దెబ్బతీయలేరు



పనిని ప్రేమిస్తూ అందులో తమదైన నైపుణ్యం చూపించేవారు గౌరవం, హోదా,డబ్బు తప్పక పొందుతారు. మీ నైపుణ్యాన్ని నలుగురి ముందు ప్రదర్శించినప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు.



మీలో మైనస్ ఉన్నప్పుడే శత్రువుకి భయపడాలి..మీరు తప్పు చేసినప్పుడే శత్రువుకి అవకాశం చిక్కుతుంది. అలాంటప్పుడు తెలివి, జ్ఞానం,నిజాయితీ, సంస్కారం, నైపుణ్యం మీ సొంతం అయినప్పుడు ఎంతమంది శత్రువులు ఒక్కటైనా ఏమీ చేయలేరు.



ఈ లక్షణాలన్నీ చాణక్యుడిలో ఉన్నాయి కాబట్టే.. నందవంశాన్ని సమూలంగా నాశనం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని విస్తరించేలా చేశాడు..