సింహంలోకి సూర్యుడు, ఈ రాశులవారికి కష్టకాలం ఆగస్టు 16 వరకూ కర్కాటక రాశిలో ఉన్న సూర్యుడు ఆగస్టు 17 బుధవారం నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు.
మేషం సూర్యుడి సంచారం మేషరాశివారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తలపెట్టిన పనులు పూర్తికావు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అప్పులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు..
వృషభం సింహరాశిలో సూర్యుడి సంచారం వృషభ రాశివారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే నెలరోజుల పాటూ ఈ రాశివారు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. ఈ సమయంలో కొన్ని వ్యాధులబారిన పడే ప్రమాదం ఉంది. కుటుంబంలో వివాదాలకు దూరంగా ఉండడం వల్ల అంతో ఇంతో మనశ్సాంతి లభిస్తుంది.
మిథునం సింహరాశిలో సూర్యుడి సంచారం ఈ రాశివారికి బాగానే ఉంటుంది. నిన్న మొన్నటి వరకూ ఆగిన పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం బావుంటుంది
కర్కాటకం ఈ రాశినుంచి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఈ ప్రభావం ఈ రాశికి చెందినవారి కుటుంబంపై పడుతుంది. కుటుంబంలో తరచూ ఏదో ఒక గొడవలు జరుగుతాయి. ఆర్థిక, మానసిక సమస్యలు చుట్టుముడతాయి. నెలరోజుల పాటూ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.
సింహం ఈ రాశిలో సూర్య సంచారం మానసిక ఒత్తిడి పెంచుతుంది. కుటుంబంలో తగాదాలు మానసింకగా మిమ్మల్ని కుంగదీస్తాయి. కోపం తగ్గించుకోకుంటే మరింత ప్రమాదం. ఆరోగ్యం జాగ్రత్త.
కన్య సింహ రాశిలో సూర్యుడి సంచారం కన్యారాశివారిని ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుంది. కంటికి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ నెలరోజులు మాట, ప్రవర్తనను అదుపులో పెట్టుకోవడం మంచిది.
తుల సింహ రాశిలో సూర్య సంచారం తులారాశివారికి యోగదాయకం అనే చెప్పాలి. ఏపని మొదలెట్టినా సక్సెస్ అవుతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చికం సూర్యుని రాశి మార్పు వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది. అనుకోని ధనం చేతికందుతుంది. జీవితానికి సంబంధించిన అతి పెద్ద కష్టం తొలగిపోతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు కోలుకుంటారు.
ధనుస్సు సింహరాశిలో సూర్యుని సంచారము ధనుస్సు రాశివారి రిలేషన్స్ పై చెడు ప్రభావం చూపిస్తుంది. ఈనెల రోజులూ వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు.
మకరం సింహరాశిలో సూర్యుని సంచారం మకరరాశి వారికి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. వాహన ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త.
కుంభం సూర్యుడి సంచారం కుంభరాశివారికి అంత బాలేదు. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానసిక, శారీరక ఇబ్బందులు పెరుగుతాయి. ఈ నెలరోజులూ ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి.
మీనం సింహరాశిలో సూర్యుడి సంచారం మీనరాశికి శుభప్రదంగా ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు కలిసొస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందుతారు. అనారోగ్యం తొలగిపోతుంది. ధనలాభం ఉంటుంది...