చాణక్య నీతి: ఈ మూడు విషయాల్లో సిగ్గు, మొహమాటం ఉండకూడదన్న చాణక్యుడు
క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దం, మూడో శతాబ్దం మధ్యకాలంలో జీవించిన గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు కౌటిల్యుడు.
అపారమైన రాజనీతిజ్ఞత వందల సంవత్సరాలు నిరంతరాయంగా పాలించిన నందవంశాన్ని నిర్మూలించి…మగధ సింహాసనంపై చంద్రగుప్తుడిని కూర్చోబెట్టిన అపర మేధావి.
నందవంశ నిర్మూలను…మౌర్య వంశ స్థాపనకు మూల కారకుడు కౌటిల్యుడే. ప్రపంచ ప్రసిద్ధి గ్రీకు తత్వవేత్తలు ప్లేటో, అరిస్టాటిల్ సరసన కూర్చోబెట్టాల్సిన మేధావి. జగజ్జేత అలెగ్జాండర్ కి అరిస్టాటిల్ గురువైతే…చాణక్యుడు చంద్రగుప్తుడికి గురువు.
దేశాన్ని కబళించేందుకు కొన్ని ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని ఇంకా ముందుకి రావాలని చూస్తున్న అలెగ్జాండర్ దూకుడికి కళ్లెం వేసి… అప్పట్లో విదేశీ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించిన చిరస్మరణీయులు చాణక్య చంద్రగుప్తులు.
తన రచనల్లో రాజనీతిశాస్త్రం,ఆర్థిక క్రమశిక్షణ,న్యాయశాస్త్రం గురించి మాత్రమే కాదు.. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గనిర్దేశం చేశాడు. ఏ వ్యక్తి కూడా ముఖ్యంగా మూడు విషయాల్లో అస్సలు మొహమాటం, సిగ్గు పడకూడదని చెప్పాడు చాణక్యుడు
మొదటిది జ్ఞాన సముపార్జ వ్యక్తికి జ్ఞాన సముపార్జన అనేది చాలా ముఖ్యం. గురువు నుంచి జ్ఞాన్నాన్ని స్వీకరించే విషయంలో ఏమాత్ర మొహమాటపడొద్దన్నారు చాణక్యుడు.
ఎలాంటి సందేహాలున్నా గురువును అడిగి నివృతి చేసుకోవాలని చెప్పాడు. గురువు నుంచి సరైన జ్ఞానం పొందేవారు జీవితంలో ఎలాంటి సమస్యను అయినా ఎదుర్కోగలరని చెప్పాడు
అవసరం అయితే అప్పు అడగడండి అత్యవసరం అయినప్పుడు డబ్బు అడిగే విషయంలో ఎప్పుడూ వెనుకాడకూడదన్నాడు చాణక్యుడు. డబ్బుకు సంబంధించి పనుల్లో వెనుకాడితే ఇబ్బందులుపడాల్సి వస్తుందన్నాడు.
ఆడంబరాలు వద్దు హోదా చూపిస్తేనే సమాజంలో గౌరవం అనే ఉద్దేశంతో చాలామంది సాధారణ జీవితం గడిపేందుకు మొహమాటపడతారన్న చాణక్యుడు.. ఎదుటివారి కోసం ఆడంబరాలకు పోతే లేని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నాడు.