Ennenno Janmalabandham August 24th: యష్ ని ఘోరంగా అవమానించిన కొడుకు ఆదిత్య- తల్లడిల్లిన తండ్రి మనసు
యష్ మీద పగ సాధించడం కోసం ఆదిత్యను ఎక్కుపెడతాడు అభిమన్యు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తన కొడుకు ఫోన్ చేశాడన్న సంతోషంలో వేద దగ్గరకి వెళ్ళిన యష్ తనని అమాంతం ఎత్తుకుని తిప్పి కౌగలించుకుంటాడు. ఏమైందని వేద అడుగుతుంది, చాలా సంతోషంగా ఉన్నాను అని సంబరంగా చెప్తాడు. నీ విష్ నిజమైంది వేద ఇన్నాళ్ల నా ప్రార్థనలు విన్న దేవుడు వరం ఇచ్చాడేమో అంత కలలాగా ఉంది లైఫ్ లో ఇంత హ్యాపీనెస్ ఎప్పుడు లేదని అంటాడు. ఇప్పటి వరకు డల్ గా ఉన్న మీరు ఇలా ఉండటానికి రీజన్ ఏంటి అని అడుగుతుంది. ఆదిత్య ఫోన్ చేశాడని చెప్తాడు. నా మాటలు దేవుడు వినడం వరం ఇవ్వడం కాదఉ ఇది మీ తండ్రి ప్రేమ గెలుపు అని వేద చెప్తుంది. ఈవినింగ్ మనల్ని బర్త్ డే పార్టీకి రమ్మని పిలిచినట్టు చెప్తాడు. ఖుషి వచ్చి ఏమైంది ఏదో మాట్లాడుకుంటున్నారని అడుగుతుంది, మీ అన్నయ్య వచ్చాడు ఈరోజు తన బర్త్ డే అని యష్ చెప్తాడు. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది, నీకు సర్ ప్రైజ్ ఇద్దామని వేద కవర్ చేస్తుంది, ఈవినింగ్ మీ అన్నయ్య బర్త్ డే పార్టీ ఉంది మనం వెళ్తున్నాం అని చెప్పడంతో ఖుషి కూడా సంతోషిస్తుంది.
యష్ ఈ సంతోషాన్ని వసంత్ తో కూడా పంచుకుంటాడు. ఆదిత్య ఫోన్ చేశాడు మనం వెళ్ళాలి అని చెప్తాడు. బెస్ట్ గిఫ్ట్ తీసుకుని రమ్మని అంటాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన ఆదిత్య యష్ ని డైరెక్ట్ గా మీట్ అవకుండా ఫోన్ చేసి పార్టీకి రమ్మని చెప్పడం ఏంటని వసంత్ అనుమానిస్తాడు. యష్ ఆదిత్య ఫోన్ విషయాన్ని తన తల్లిదండ్రులకి కూడా చెప్పి సంతోషాన్ని పంచుకుంటాడు. ఆదిత్య ఎక్కడ ఉన్నాడని మాలిని అడుగుతుంది. మాళవిక దగ్గర అనేసరికి అక్కడ ఎందుకు ఉన్నాడు ఇక్కడకి రమ్మని చెప్పొచ్చు కదా అంటే మనం మాళవిక దగ్గరకి వెళ్ళడం కాదు నా కొడుకు కోసం వెళ్తున్నామని యష్ అంటాడు. నా కొడుకు కోసం ఏమైనా సహిస్తాను అక్కడ ఎవరు ఏం మాట్లాడినా నేను మౌనంగా ఉంటానని అంటాడు.
Also Read: తులసి, సామ్రాట్ గురించి నీచంగా ఆర్టికల్- రచ్చ చేసిన అభి, అనసూయ బుర్రలో విషం నింపిన నందు, లాస్య
మాళవిక అభిమన్యు మీద కోప్పడుతుంది. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని అంటుంది. దేని గురించి అని అభి అంటే పార్టీ గురించి. దీనికి వాళ్ళు రావడం వల్ల పార్టీ డిస్ట్రబ్ అవుతుందేమో అని అనిపిస్తుంది, ఆదిని బయటకి తీసుకెళ్లాలని అనుకున్నాం కదా మరి ఇదంతా ఎందుకని అడుగుతుంది. ఖుషి కోసం నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన అవమానం మర్చిపోతున్నావ్, వాళ్ళు వస్తే డిస్ట్రబెన్స్ అని అనుకున్నావ్ కానీ అది రీవెంజ్ తీర్చుకునే అవకాశం అని ఎందుకు అనుకోలేకపోతున్నావని అభి అంటాడు. పార్టీలో ఏదైనా గొడవ అయితే.. గొడవ కాదు అడుగడుగునా అవమానించమంటున్న కొడుకో కోసం వస్తున్న ఆ యష్ తో ఆడుకోమంటున్నా తల్లి ప్రేమతో నా బంగారం ఆ ఇంటికి వెళ్తే నిన్ను బాధపెడతారా, ఏ ఖుషిని చూసుకుని నిన్ను బాధపెడుతున్నారో ఆ ఖుషిని తీసుకుని ఈ ఇంటికి వచ్చేలా చేస్తున్నాను. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే ఆకేషనే ఈ బర్త్ డే పార్టీ, ఎందుకు వచ్చాము రా అని నెత్తి నోరు కొట్టుకుని వాళ్ళు వెళ్లిపోవాలి, తల్లి కూతుళ్లని కలపడమే కాదు నా బంగారం ఆహన్ని కూడా గెలిపించడమే నా టార్గెట్ అని అభిమన్యు తన కుట్రని బయటపెడతాడు.
మాళవిక అది విని చాలా సంతోషంగా వెళ్ళి అభిని కౌగలించుకుని లవ్యూ నా కోపాన్ని నీ ప్రతీకారంగా మార్చుకున్నందుకు చాలా హ్యాపీ అని అంటుంది. యష్ పార్టీకి వెళ్ళడానికి హడావుడి చేస్తాడు. కాంచన ఖైలాష్ కి ఫోన్ చేసి ఆ ఇంటికి వస్తున్నట్టు చెప్తుంది. మేము వస్తున్నాం అక్కడ మీరు ఎవరికి కనిపించకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. ఖైలాష్ అభి దగ్గరకి వెళ్ళి యష్ వాళ్ళు స్టార్ట్ అయ్యారంట అని చెప్తాడు. యష్ వాళ్ళు మాళవిక ఇంటికి వస్తారు. అక్కడ ఉన్న తన కొడుకు ఫోటో చూసుకుని మురిసిపోతాడు. ఆదిత్య బెస్ట్ ఫ్రెండ్స్ ని కూడా మాళవిక పార్టీకి పిలిచి తనకి సర్ ప్రైజ్ ఇస్తుంది. అది చూసి ఆది చాలా సంతోషిస్తాడు. థాంక్యూ మామ్ అని తనకి ప్రేమగా ముద్దు పెడతాడు. యష్ కుటుంబం అంతా మాళవిక ఇంట్లోకి వస్తుంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆపేస్తుంది. ఇన్విటేషన్ కార్డ్ చూపించమని అడుగుతారు.
Also read: కాలేజీలో ఫేర్ వెల్- వసు, రిషి దూరం కానున్నారా?
తరువాయి భాగంలో..
ఆది నేకు వీడియో గేమ్స్ చాలా ఇష్టమని నీకోసం గేమింగ్ డివైజ్ తీసుకొచ్చాను తీసుకో అని యష్ ప్రేమగా ఇవ్వబోతాడు. ఆదిత్య అక్కడ ఉన్న డ్రైవర్ ని పిలిచి మీ అబ్బాయి ఏజ్ ఎంత అని అడిగి యష్ చేతిలోని గిఫ్ట్స్ డ్రైవర్ కి ఇచ్చేస్తాడు. ఇదే కాదు ఇలా ఏ గిఫ్ట్ తెచ్చినా దాన్ని డ్రైవర్స్, వాచ్ మెన్, వర్కర్స్ కి ఇస్తాను తప్ప నేను తీసుకొను అని ఆదిత్య కఠినంగా చెప్పడంతో యష్ ఆశ్చర్యపోతాడు. చాలా బాధపడతాడు.