అన్వేషించండి

Guppedanta Manasu August 23rd Update: కాలేజీలో ఫేర్ వెల్- వసు, రిషి దూరం కానున్నారా?

గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. సాక్షి ఎట్టకేలకు పెళ్లి వద్దని వెళ్లిపోవడంతో వసు-రిషికి రూట్ క్లియర్ అయింది..

వసు కారు దగ్గర నిలబడి వాగుతూ ఉంటే రిషి కనిపిస్తాడు. రిషిని చూసి వసు బిత్తర మొహం వేస్తుంది. సర్ మీరేంటి ఇక్కడా అని అడుగుతుంది. కారు నాదే కదా నా కారు దగ్గర నేను నిల్చున్నాను అంటాడు. సర్ మొత్తం విన్నారా అని అమాయకంగా అడుగుతుంది. అదేంటో నాకు వినికిడి శక్తి బాగానే ఉందని అంటాడు మన ఈగో మాస్టర్. ఎందుకు వచ్చారు సర్.. అదే ఏ మాట అనేటప్పుడు వచ్చారు అని క్యూట్ గా అడుగుతుంది. అవన్నీ వదిలేయ్ ఎదురుగా వస్తే ఏదో మామూలుగా ఉండదు అన్నావ్ గా... అయ్యో అదేం లేదు సార్ అంతా ఉత్తిత్తినే అబ్బే ఏం లేదు అని కవర్ చేసుకోలేక తంటాలు పడుతుంది. ఏదో టప టప అడిగేస్తాను అన్నావ్ గా అడుగు అని మరోసారి రిషి అంటే అబ్బే అదేం లేదు సర్ ఉత్తిత్తినే అని టపాటపా అని నేను ఎలా అడుగుతాను సార్ నేను క్లాస్ కి వెళ్తాను అని తప్పించుకుంటుంది. మీరు ఎప్పుడు వచ్చారో చెప్పలేదు అంటే బుక్ ఇవ్వు రాశావు కదా అని అడిగి అది తీసుకుని వెళ్ళిపోతాడు.

ఎప్పుడు వచ్చారంటే చెప్పొచ్చుగా సరే వచ్చారే అనుకో ఏంటి వసుధార ఏదో చెప్పాలని అనుకున్నావ్ గా చెప్పు అని శాంతంగా అడగొచ్చుగా ఆడగరఉ సీరియస్ గా అడిగితే ఎలా చెప్తాం అని వసు అంటే విని వెనక్కి తిరిగి రిషి క్లాస్ ఉంది అన్నావ్ గా అంటాడు. వెళ్తున్నా సర్ అని వసు వెళ్లిపోతూ ఇంకోసారి ఈ కారుతో అసలు మాట్లాడుకోకూడదని అనుకుంటుంది. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా రెండు గంటలు ఎక్కువసేపు స్టూడెంట్స్ ని ఉంచి చదివిద్దామని ఒక మేడమ్ జగతితో అంటుంది. ఎక్కువ సేపు చదివస్తే ఎక్కువ మార్కులు వస్తాయని అనుకోకూడదు వాళ్ళకి చదువకోవడానికి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని జగతి చెప్తుంది. రిషి అక్కడికి వచ్చిన తర్వాత ప్రొఫెసర్స్ కూడా పరీక్షల గురించి మాట్లాడితే జగతి చెప్పిన మాటే చెప్తాడు. అది విని జగతి మురిసిపోతుంటే మహేంద్ర సంబరపడతాడు. ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేద్దామని రిషి చెప్తాడు.

Also Read: మోనిత వచ్చేసిందోచ్ - డాక్టర్ బాబు కోసం వెతుకులాట, దీపకు ఊహించని షాక్

ఎగ్జామ్స్ అయిపోతే రిషి, వసు కూడా విడిపోతారు. ఈ ఎగ్జామ్స్ అయ్యేలోపు వాళ్ళ మధ్య అపార్థాలు తొలగించుకోవాలి అని జగతి అంటే మనం ఏం చెయ్యలేమా మహేంద్ర అంటాడు. చేయాల్సింది అంతా చేశాం ఇంక మనం చేసేది ఏమి లేదని అంటుంది. నేను ఇవ్వలేని ప్రేమ రిషికి వసు ఇచ్చింది. వసు రిషికి తోడుంటే తనకి జీవితం ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని జగతి చెప్తుంది.  వాళ్ళఇద్దరినీ కలపడానికి గౌతం హెల్ప్ కూడా తీసుకుందామని మహేంద్ర అంటాడు. అప్పుడే రిషి క్యాబిన్ కి గౌతమ్ వస్తాడు. ఫేర్ వెల్ అంటే ఎంతో తెలుసా వీడ్కోలు క్లాస్ మేట్స్ కలుస్తారు విడిపోతారు, మరో సోల్ మేట్స్ సంగతి ఏంట్రా అని అడుగుతాడు.

రిషి: రేయ్ ఏం చెప్పాలని అనుకుంటున్నావ్

గౌతమ్: రేయ్ ఒకప్పుడు నువ్వంటే భయం ఉండేది ఇప్పుడు లేదు డైరెక్ట్ గా అడుగుతున్నా.. వసుధార నిన్ను ప్రేమిస్తుంది కదా అది నిజమే కదా

రిషి; ఆ టాపిక్ ఇప్పుడు అవసరం లేదు తర్వాత మాట్లాడుకుందాం

గౌతమ్: నీతో ఇదేరా సమస్య టాపిక్ ని మధ్యలోనే ఆపేస్తావ్. ఒకసారి ఏదో జరిగింది అంతా మాత్రాన బిగుసుకుపోతే ఎలా పోనీ నన్ను మాట్లాడమంటావా

రిషి: ఒక సమస్య వచ్చింది అది దానంతట అదే పరిష్కారం అవుతుందని అనుకుంటున్నా

గౌతమ్: కాకపోతే.. రేయ్ ఫేర్ వెల్ పార్టీ క్లాస్ మేట్స్ మధ్యే కావచ్చు, కానీ ఇక్కడ నీకు అర్థం కానీ విషయం ఏంటంటే మీరిద్దరు కూడా విడిపోతున్నారు. ఎగ్జామ్స్ అయిపోతే వసుధార వెళ్ళిపోతుంది. పరీక్షలో ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఉంటుంది కానీ లైఫ్ లో అలా కాదు మీరిద్దరు విడిపోతే మళ్ళీ కలిసే అవకాశం ఉండదు. నేను ఏదో ఆకతాయిగా మాట్లాడుతున్నా అనుకోకు. ప్లీజ్ నీ మనసులో ఏముందో చెప్పు నేను మాట్లాడతాను. మీరిద్దరూ అర్థం కాకుండా ప్రవర్తిస్తే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఫేర్ వెల్ పార్టీ అయ్యేలోపు ఏదో ఒకటి తేలిపోతుంది.

రిషి: నువ్వు వెళ్ళి తనతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక టైం అంటూ వస్తే మన సమస్యలు మబ్బు తెరల్లా విడిపోతాయి. టైం వస్తే నేను చేయాల్సినది చేస్తాను చెప్పాల్సింది చెప్తాను. నా విషయంలో నువ్వు చూపిస్తున్న సానుభూతికి థాంక్స్. కానీ ఇలాంటి విషయాల్లో మూడో వ్యక్తి ప్రమేయం లేకపోవడమే మంచిదని నా ఉద్దేశం.. నువ్వు వెళ్లొచ్చు.

గౌతమ్: మనస్పూర్తిగా చెప్తున్న బంగారం లాంటి వసుధారని వదులుకోకు మీ ఇద్దరికి మీరే ప్రాబ్లం. చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ ఉంటారు. వసుధారని వదులుకోకు రా ప్లీజ్ అని అంటుంటే అదంతా విని వసు షాక్ అవుతుంది. అక్కడ నుంచి మౌనంగా బాధగా వెళ్లిపోతుంటే మహేంద్ర ఎదురుపడతాడు. వసుధార అని పిలుస్తున్న ఆగకుండా బాధగా అక్కడ నుంచి వెళ్లిపోతుంటే ఏమైందా అని ఆలోచిస్తాడు.

Also Read: నువ్వెవరో తెలియదన్న కార్తీక్, ఇన్విస్టిగేషన్ ప్రారంభించిన దీప, మోనిత ఎంట్రీకి టైమ్ వచ్చేసింది

వసు అమ్మవారి ముందు నిలబడుతుంది. రిషి సార్ ని నాకు దూరం చెయ్యకు. రిషి సార్ నా మనసు తెలుసుకోవాలి, ఆ అవకాశం నాకు రావాలి, రిషి సర్ మనసెంటో నాకు తెలుసు నా మనసెంటో నీకు తెలుసు. నన్ను నువ్వే నడిపించాలి నా మనసులో మాట రిషి సర్ వినేలా చేయమ్మా అని వేడుకుంటుంది. వెనక్కి తిరిగి చూసేసరికి మహేంద్ర ఉంటాడు. తనని చూసి వసు షాక్ అవుతుంది. ఆ అమ్మవారిని నేను ఏమడిగానో విన్నారా సర్ అని అంటుంది. కొంత విన్నాను కొంత అర్థం చేసుకున్నాను డబ్బుని దాచుకున్నట్టు మనసులో మాట దాచుకుంటే కుదరదు ఎప్పటికైనా మీరిద్దరు ఒకటి కావాలని నేను జగతి కోరుకుంటున్నాం. మేము ఎప్పుడు రిషి గురించి ఆలోచిస్తాము కానీ ఇప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాం మనసులో మాట చెప్తే మబ్బు తెరలు విడిపోతాయి కదా ఒక్క అడుగు ముందుకు వెయ్యి అని చెప్తాడు. మౌనం చాలా మంచి అలవాటు కానీ ఆ మౌనం అన్ని సార్లు కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపోతాడు.

రిషి వసు ఫోటో చూస్తూ ఉంటాడు. నువ్వు నాకొక పజిల్ గా మిగిలిపోతున్నావ్, అందమైన జ్ఞాపకాలు అన్ని నాకు అందించావ్ వాటిని చూసి మురిసిపోయేలోపు దూరంగా వెళ్లిపోతున్నావ్ అని రిషి అనుకుంటాడు. అటు వసు వీఆర్ పేరు ఉన్న ఉంగరం చూసి మురిసిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Tummala Nageswararao: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - రూ.2 లక్షలకు పైబడిన వారికి రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Embed widget