Balakrishna: బాలకృష్ణకు సర్జరీ జరగలేదు, మరి కాలుకు ఆ కట్టు ఏంటి? అసలు నిజం ఇదిగో!
నటసింహం నందమూరి బాలకృష్ణ మోకాలికి సర్జరీ జరిగిందా? జరిగిందని ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒక్కటే ప్రచారం జరుగుతోంది. అసలు, జరగలేదనేది నిజం. మరి, కాలుకు ఆ కట్టు ఏంటి? అంటే...
నటసింహం నందమూరి బాలకృష్ణకు ఏమైంది? ఆయనకు సర్జరీ జరిగిందా? మోకాలి సమస్యతో బాలయ్య ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒకటే హడావిడి. బాలయ్యకు సర్జరీ జరిగిందనేది ఆ హడావిడి సారాంశం. దాంతో అభిమానులు ఆందోళన చెందారు. తమ కథానాయకుడికి ఏమైందోనని ఆరాలు తీయడం ప్రారంభించారు. దాంతో బాలకృష్ణకు చెందిన పీఆర్వోలు స్పందించారు.
''బాలకృష్ణ గారికి ఎటువంటి సర్జరీ జరగలేదు. కేవలం రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే ఆయన ఆస్పత్రికి వెళ్లారు. ఈ రోజు (ఏప్రిల్ 26, మంగళవారం) సారధి స్టూడియోస్ లో జరిగిన NBK 107 చిత్రీకరణకు పాల్గొన్నారు. దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయవద్దు'' అని బాలకృష్ణ స్నేహితులు పేర్కొన్నారు.
బాలకృష్ణకు సర్జరీ జరగకపోతే, కాలుకు కట్టు ఎందుకు ఉంది? ఆ క్యాప్ సంగతి ఏమిటి? అంటే... ఆయనకు మోకాలి సమస్య ఉన్న మాట వాస్తవమే. అందుకని, ఆస్పత్రికి వెళ్లారు. బాలకృష్ణకు సర్జరీ అవసరమని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఆయన సినిమా చిత్రీకరణ చేస్తున్నారు. మరో రెండు సినిమాలు లైనులో ఉన్నాయి. మోకాలికి సర్జరీ చేయించుకుంటే... కనీసం ఒక నెల అయినా విశ్రాంతి తీసుకోవాలి. అందుకని, సర్జరీని వాయిదా వేశారట.
గత ఏడాది నవంబర్ నెలలో బాలకృష్ణకు షోల్డర్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. భుజం ఎంత ఇబ్బంది పెట్టినా సరే లెక్క చేయకుండా అభిమానుల కోసం 'అఖండ' సినిమాలో 'జై బాలయ్య' పాటకు డ్యాన్స్ చేశారు. ఇప్పుడు మోకాలు ఇబ్బంది పెడుతున్నా షూటింగ్ చేస్తున్నారు. సినిమా అంటే అంత డెడికేషన్ ఆయనకు!
Also Read: 'ఆచార్య'లో రామ్ చరణ్ బదులు పవన్ కళ్యాణ్ చేస్తే? - తమ్ముడి గురించి అన్నయ్య ఏమన్నారంటే?
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినెమా చేస్తున్నారు. ఆయన 107వ చిత్రమిది. అందుకని , NBK 107ను వర్కింగ్ టైటిల్ గా పెట్టారు. ఈ చిత్రానికి 'జై బాలయ్య' టైటిల్ ఖరారు చేసినట్టు భోగట్టా. అయితే, ఆ విషయాన్ని దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. గోపీచంద్ మలినేని సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించారు బాలయ్య. ఆ తర్వాత 2024 ఎన్నికలకు ముందు రాజకీయ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నారట.
Also Read: మీ సినిమాకు టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఉందా? - చిరంజీవి సమాధానం ఏమిటంటే?