By: ABP Desam | Updated at : 26 Apr 2022 02:57 PM (IST)
పవన్ కళ్యాణ్, చిరంజీవి... రామ్ చరణ్, చిరంజీవి
Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి, ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలసి నటిస్తే? సిల్వర్ స్క్రీన్ మీద ఈ కాంబినేషన్ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇంతకు ముందు అన్నయ్య సినిమా 'శంకర్ దాదా జిందాబాద్'లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తళుక్కున మెరిశారు. మళ్లీ వీళ్ళిద్దరూ కలిసి నటించే ఛాన్స్ ఉందా? సరైన కథ కుదిరితే కలిసి నటించవచ్చు. చెప్పలేం!
భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది పక్కన పెడితే... ఒకవేళ ఆచార్య సినిమాలో రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ చేసి ఉంటే? - ఈ రోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఆచార్య విలేకరుల సమావేశంలో చిరంజీవి (Chiranjeevi) కి ఈ ప్రశ్న ఎదురైంది.
చిరంజీవి మాట్లాడుతూ "రామ్ చరణ్ చేసిన సిద్ధ పాత్రలు హీరోలు అందరూ న్యాయం చేస్తారు. అందులో మరో సందేహం లేదు. కానీ, రామ్ చరణ్ చేస్తే ఆ ఫీల్ వేరు. నిజ జీవితంలో తండ్రీ తనయుల అనుబంధం వెండి తెరపై పాత్రలకు యాడెడ్ వేల్యూ అవుతుంది. ఇదే విషయం మొన్న కూడా చెప్పాను. ఒకవేళ చరణ్ కు ఈ పాత్ర చేయడం కుదరలేదు అనుకోండి... చరణ్ కూడా దొరకలేదు అనుకోండి... బెస్ట్ ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్'' అని చెప్పారు.
చరణ్ బదులు పవన్ ఉన్నా తనకు సేమ్ ఫీలింగ్ వచ్చేదని చిరంజీవి తెలిపారు. ఆయన మాట్లాడుతూ "ఒకవేళ సిద్ధ పాత్రలో పవన్ కళ్యాణ్ ఉంటే నిజ జీవితంలో మా అనుబంధం యాడెడ్ వేల్యూ అయ్యేది. చరణ్ చేసినప్పుడు ఏ ఫీలింగ్ అయితే వచ్చిందో... నాకు అదే ఫీల్ ఉంటుంది. వంద శాతం అదే ఫీలింగ్ వస్తుంది. అందులో నో డౌట్. అయితే, అంత వరకూ రాలేదనుకోండి. ఈ సినిమాకు అన్నీ కుదిరాయి'' అని చెప్పారు.
Also Read: మీ సినిమాకు టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఉందా? - చిరంజీవి సమాధానం ఏమిటంటే?
చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి 'ఆచార్య' చిత్రాన్ని నిర్మించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
Also Read: 'జబర్దస్త్'కు జడ్జ్ కావలెను, రోజాను రీప్లేస్ చేసేది ఎవరు?
Prabhas: యాక్షన్ డోస్ పెంచమంటున్న ప్రభాస్ - ఫ్యాన్స్ కోసం నొప్పి కూడా లెక్క చేయకుండా!
Sriya Lenka: ‘K-పాప్’ ఆర్టిస్ట్‌గా ఇండియన్ అమ్మాయి, కొరియా మొత్తం ఫిదా!
Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!
NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
IPL 2022, GT vs RR Final: బట్లర్ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్ ఉన్నాడోచ్!
TDPకి సరికొత్త నిర్వచనం చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి, నారా లోకేష్, మహానాడుపై సెటైర్లు
Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !
IPL 2022, GT vs RR Final: లక్షా పదివేల మంది ఎదుట ట్రోఫీ ఎత్తేది ఎవరు? RRపై 2-0తో GTదే పైచేయి!