అన్వేషించండి

Acharya: మీ సినిమాకు టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఉందా? - చిరంజీవి సమాధానం ఏమిటంటే?

'ఆచార్య'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇచ్చిన సంగతి తెలిసిందే. టికెట్ రేట్లు ఎందుకు పెంచారని ప్రశ్నిస్తే చిరంజీవి ఏం సమాధానం చెప్పారో తెలుసా?

Acharya: మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన సినిమా 'ఆచార్య'. ఏప్రిల్ 29న... అనగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో పది రోజుల పాటు టికెట్ మీద 50 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో రూ. 50, సింగిల్ స్క్రీన్ లో రూ. 30 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు.

టికెట్ రేట్లు పెంచడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత మంది విమర్శిస్తున్నారు. 'చిరంజీవి సినిమాకు టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం ఉందా?' - ఈ రోజు ఏర్పాటు చేసిన ఆచార్య విలేకరుల సమావేశంలో చిరంజీవికి ఎదురైన ప్రశ్న.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ "కరోనాతో అన్ని రంగాలు కుంటు పడ్డాయి. అందుకు సినిమా పరిశ్రమ ఏమీ అతీతం కాదు. ప్రపంచంలో అన్ని రంగాలు నష్టపోయినట్టు... మా సినిమా రంగం కూడా నష్టపోయింది. కరోనా వల్ల బడ్జెట్ పై వడ్డీలకు వడ్డీలు పెరిగాయి. మా సినిమాకు ఎంత వడ్డీ కట్టామో తెలుసా? ఒక మీడియం సినిమాకు ఎంత బడ్జెట్ అవుతుందో అంత వడ్డీ కట్టాం" అని చెప్పారు.

"మా ఆచార్య సినిమాకు  సుమారు 50 కోట్లు బడ్జెట్ పెరిగింది. ఈ కరోనా కాలంలో వడ్డీల వల్ల పెరిగిన భారం ఇది. టిక్కెట్ ధరలు పెంచమని ప్రభుత్వాలు దగ్గర వేడుకుంటే తప్పేముంది? వినోదాన్ని పంచే నటులకు ప్రేక్షకులు ఇంతా అని ఇస్తున్నారు, అందులో తప్పేముంది? ఇది అడుక్కోవడం కాదు. మేం ప్రభుత్వాలను వేడుకున్నాం, వాళ్ళు ప్రజలపై భారం పడకుండా రేట్లు పెంచారు" అని చిరంజీవి స్పందించారు.

Also Read: అక్షయ్ కుమార్‌తో హీరో సూర్య తొలి బాలీవుడ్ చిత్రం

బడ్జెట్లు పెరగడం వల్ల టికెట్ రేట్లు పెంచాల్సి వస్తోందని దర్శకుడు కొరటాల శివ అన్నారు. ఆచార్య సినిమా కోసం చిరంజీవి గారు మూడేళ్లు కష్టపడి పని చేశారని, ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూ...  రామ్ చరణ్ ఈ సినిమా కోసం పని చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి ఆఫీసుకు వస్తే... బడ్జెట్ లెక్కలు ఎంత అయ్యిందో చెబుతామని ఆయన తెలిపారు.

Also Read: 'జబర్దస్త్'కు జ‌డ్జ్‌ కావలెను, రోజాను రీప్లేస్ చేసేది ఎవరు?

చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి 'ఆచార్య' చిత్రాన్ని నిర్మించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు.

టాప్ హెడ్ లైన్స్

Sunday OTT Movies : ఓటీటీల్లో టాప్ 10 మూవీస్ - ఆదివారం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చెయ్యండి... 4 సినిమాలు డోంట్ మిస్
ఓటీటీల్లో టాప్ 10 మూవీస్ - ఆదివారం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చెయ్యండి... 4 సినిమాలు డోంట్ మిస్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Suspense Thriller Series OTT : మాజీ భార్యల చావు వెనుక మిస్టరీ - ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
మాజీ భార్యల చావు వెనుక మిస్టరీ - ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Srimathi Movie OTT : ప్రతీ మధ్య తరగతి 'శ్రీమతి' కథ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ప్రతీ మధ్య తరగతి 'శ్రీమతి' కథ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
MS Dhoni Retirement:  ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
Embed widget