Suriya Bollywood Movie: అక్షయ్ కుమార్‌తో హీరో సూర్య తొలి బాలీవుడ్ చిత్రం
సూర్య హీరోగా నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు.
![Suriya Bollywood Movie: అక్షయ్ కుమార్‌తో హీరో సూర్య తొలి బాలీవుడ్ చిత్రం Akshay Kumar starts shooting for Hindi remake of Suriya's Telugu hit 'Aakasam Nee Haddura' Suriya Bollywood Movie: అక్షయ్ కుమార్‌తో హీరో సూర్య తొలి బాలీవుడ్ చిత్రం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/26/6f40aa0fa7c35be53604a3eb8922cd91_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తమిళ హీరో సూర్య తొలిసారి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. అయితే, నటుడిగా కాదు.. నిర్మాతగా. ఆయన తమిళంలో నటించిన ‘సూరరై పొట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’) సినిమాను హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. దీనికి కూడా సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో సూర్య పోషించిన పాత్రలో అక్షయ్ కుమార్ కనిపించనున్నారు. ఆయన సరసన రాధిక మదన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘కొత్త ఆరంభం.. మీ అందరి ప్రేమ, ఆశ్వీరాదాలు కావాలి’’ అంటూ సూర్య ట్విట్టర్ ద్వారా ఈ సినిమా గురించి ప్రకటించారు. ఈ చిత్రానికి కూడా నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించనున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ డెడికేషన్, ప్యాషన్ చూశారా?
సూర్య, జ్యోతికల 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విక్రమ్ మల్హోత్ర సహ నిర్మాత. ఈ చిత్రం ప్రముఖ పారిశ్రామిక వేత్త, ‘ఎయిర్ డెక్కన్’ వ్యవస్థాపకుడు జీఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా వచ్చిన ‘సింప్లి ఫ్లై’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 వల్ల ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. మంచి కథనంతో ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Also Read: తెలంగాణలో ఆచార్య టికెట్ రేట్లు పెంపు - ఎంత పెరిగాయంటే?
A new begining… need all your love and blessings!! @akshaykumar @Sudha_Kongara @gvprakash @CaptGopinath @CapeOfGoodFilm @Abundantia_Ent @2D_ENTPVTLTD pic.twitter.com/R69zacDR70
— Suriya Sivakumar (@Suriya_offl) April 25, 2022
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)