By: ABP Desam | Updated at : 25 Apr 2022 06:51 PM (IST)
పవన్ కళ్యాణ్ డెడికేషన్, ప్యాషన్ చూశారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ 'హరిహర వీరమల్లు' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 2021 ఆరంభంలో సినిమా షూటింగ్ కూడా జరిగింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ నుంచి సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గా ఈ సినిమా కోసం పవన్ కత్తిసాము ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోను షేర్ చేయగా.. అది బాగా వైరల్ అయింది.
ఇప్పుడు షూటింగ్ సెట్ లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు దర్శకుడు క్రిష్. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ కెమెరాలో అవుట్ పుట్ ను చూస్తూ కనిపించారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ 'హరిహర వీరమల్లు' ఇంటెన్స్ టేక్ ఎంతో ప్యాషన్ తో చెక్ చేస్తున్న సమయంలో అంటూ క్యాప్షన్ ఇచ్చారు క్రిష్. ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది.
అడగకుండానే అప్డేట్స్ ఇస్తుంటారని క్రిష్ ని పొగిడేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ ను హీరోయిన్ గా కనిపించనుంది. కథ ప్రకారం.. ఆమె రాకుమారి పాత్రలో కనిపించనుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాదే సినిమాను పూర్తి చేసి 2023 సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
Also Read: తెరవెనుక 'థాంక్యూ' టీమ్ - ఏం డిస్కస్ చేసుకుంటున్నారో?
Also Read: ఈ వారం థియేటర్-ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలివే
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా
Major Ticket Prices: కరోనా తర్వాత తక్కువ టికెట్ రేట్స్ వసూలు చేస్తున్న సినిమా అడివి శేష్ మేజర్
Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?
Kishan Reddy On TRS: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు కేంద్రం ఘనతే- ప్రజలు గమనిస్తున్నారన్న కిషన రెడ్డి
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !