Acharya Ticket Prices: తెలంగాణలో ఆచార్య టికెట్ రేట్లు పెంపు - ఎంత పెరిగాయంటే?
చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన సినిమా ఆచార్య ఈ శుక్రవారం (ఏప్రిల్ 29వ తేదీ) విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఆచార్య సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది.
ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ జీవో ప్రకారం ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌లో రూ.50, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.30 పెంచుకోవచ్చు. దీంతోపాటు ఐదో షో ప్రదర్శనకు కూడా వారం రోజుల పాటు అనుమతి కల్పించింది.
జీవో ఇచ్చిన కాసేపటికే బుక్‌మై షోలో ఈ సినిమా టికెట్లు కూడా ఓపెన్ చేశారు. తెలంగాణలో అనుమతులు దొరకగా... ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా రేట్లపై ఇంకా క్లారిటీ రాలేదు. సినిమా విడుదలకు ఇంకా మూడ్రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి త్వరలోనే ఏపీలో కూడా క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది.
View this post on Instagram
View this post on Instagram