Jabardasth: 'జబర్దస్త్'కు జ‌డ్జ్‌ కావలెను, రోజాను రీప్లేస్ చేసేది ఎవరు?

ఇప్పుడు 'జబర్దస్త్'కు ఒక జ‌డ్జ్‌ కావలెను. రోజా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? ఆమెను రిప్లేస్ చేసే జ‌డ్జ్‌ ఎవరు? పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకులూ ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

FOLLOW US: 

'జబర్దస్త్'... తెలుగునాట బుల్లితెరపై ఒక సంచలనం. కామెడీ షోలు కొందరు చేశారు, చేస్తున్నారు! కొన్ని షోలు వచ్చాయి, వెళ్ళాయి, కొత్తగా వస్తున్నాయి కూడా! అయితే... 'జబర్దస్త్'కు ధీటుగా టీఆర్పీ సొంతం చేసుకున్న కామెడీ షో మరొకటి లేదని చెప్పాలి. బుల్లితెర ప్రేక్షకులకు వినోదం అందిస్తూ... టీఆర్పీ విషయంలో అగ్ర తాంబూలం అందుకుంటోంది. ఇటీవల 'జబర్దస్త్'లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే... ఇప్పుడు అన్నిటికంటే పెద్ద మార్పు చోటు చేసుకోనుంది. ఆ మార్పు విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

'జబర్దస్త్' అంటే ముందుగా గుర్తొచ్చేది ఇద్దరే! ఒకరు... నాగబాబు, మరొకరు... రోజా! టీమ్ లీడర్లు ఎంత మంది వెళ్లినా... కొత్తగా ఎంత మంది వచ్చినా... చాలా ఏళ్ళు వీళ్ళిద్దరూ జ‌డ్జ్‌లుగా కొనసాగారు.‌ కొన్నాళ్ళ క్రితం 'జబర్దస్త్' నుంచి నాగబాబు బయటకు వచ్చారు. ఆ తర్వాత కూడా రోజా జ‌డ్జ్‌గా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గంలో ఆమెకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చోటు కల్పించడంతో... కన్నీళ్లతో 'జబర్దస్త్'కు రోజా వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఆమెను రీప్లేస్ చేసేది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

'జబర్దస్త్' నుంచి నాగబాబు నిష్క్రమణ తర్వాత... కార్యక్రమానికి లభించే ఆదరణ విషయంలో ఎటువంటి లోటు రాలేదు. ఆల్రెడీ ఎన్నో ఏళ్లుగా జ‌డ్జ్‌గా కొనసాగుతున్న రోజా స్కిట్స్ మధ్యలో స్పాంటేనియస్ గా వేసే పంచ్ డైలాగులు హైలైట్ అయ్యాయి.‌ అంతకు ముందు నాగబాబు కూడా స్పాంటేనియస్ గా పంచ్ డైలాగులు వేసేవారు. అయితే... నాగబాబు వెళ్ళిన తర్వాత రోజా బాగా హైలైట్ అయ్యారు. ఇదే సమయంలో నాగబాబు స్థానాన్ని భర్తీ చేసిన జ‌డ్జ్‌లు ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు.

గాయకుడు మనో గాని... ఇటీవల అతిధి జ‌డ్జ్‌లుగా సందడి చేసిన సీనియర్ హీరోయిన్లు ఆమని, ఇంద్రజ గాని, కొత్తగా వచ్చిన పూర్ణ గాని పర్వాలేదని అనిపించుకున్నారు. అయితే... వాళ్లకు రోజాను రిప్లేస్ చేసే టాలెంట్ ఉందా? అంటే ఠక్కున సమాధానం చెప్పడం కష్టమే.

బుల్లితెర వీక్షకులు కొన్నేళ్లుగా నాగబాబు, రోజాకు అలవాటు పడ్డారు. ఇప్పుడు కొత్తగా మరొకరు వస్తే... ‌‌ ఎంతవరకు ఆదరిస్తారనేది ఇప్పుడే చెప్పడం కష్టం. మరోవైపు 'జబర్దస్త్'కు 'కామెడీ స్టార్స్' గట్టిపోటీ ఇచ్చేలా కనబడుతోంది. నాగబాబు, శేఖర్ మాస్టర్, ధనరాజ్, ముక్కు అవినాష్, వేణు, కిరాక్ ఆర్పీ.... ఇలా చెబుతూ వెళితే గతంలో 'జబర్దస్త్', మల్లెమాల సంస్థ నిర్మించిన షోస్  చేసిన మెజారిటీ జనాలు ఇప్పుడు 'కామెడీ స్టార్స్' షోలో ఉన్నారు. దానికి ధీటైన పోటీ ఇవ్వాలి అంటే... 'జబర్దస్త్' మరో సూపర్ డూపర్ కామెడీ టైమింగ్ జడ్జిని తీసుకురావాలి.

Also Read: తెలంగాణలో ఆచార్య టికెట్ రేట్లు పెంపు - ఎంత పెరిగాయంటే?

మల్లెమాల సంస్థ రోజాకు మంచి రీప్లేస్ వెతికే ప్రయత్నంలో ఉన్నట్టు టీవీ ఇండస్ట్రీ టాక్. కొత్త 'జబర్దస్త్' జ‌డ్జ్‌ ఎవరనేది కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్.‌ ఆల్రెడీ రోజాతో షూట్ చేసిన ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయి. అది టెలికాస్ట్ అయిన తర్వాత కొత్త జ‌డ్జ్‌ వస్తారు.

Also Read: పవన్ కళ్యాణ్ డెడికేషన్, ప్యాషన్ చూశారా?

Published at : 26 Apr 2022 08:19 AM (IST) Tags: Roja Jabardasth Jabardasth New Judge Changes In Jabardasth

సంబంధిత కథనాలు

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Guppedantha Manasu మే 19 ఎపిసోడ్: వసుధారని తప్పించడానికి దేవయాని, సాక్షి ప్లాన్- రిషి రక్షించగలడా?

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య

Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?

Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!

Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి