Talasani Tollywood : టిక్కెట్ రేట్లు తగ్గించం, అండగా ఉంటాం.. టాలీవుడ్‌కు తెలంగాణ మంత్రి తలసాని భరోసా !
టాలీవుడ్‌కు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమ ప్రముఖులతో ఆయన సమావేశమయ్యారు.
తెలంగాణ ప్రభుత్వానికి సినిమా టికెట్ ధరలు తగ్గించే ఆలోచన లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమకు సంబంధం లేదన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు తలసానితో సమావేశమయ్యారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు. " ఎక్కడో ఎవరో టికెట్ ధరలు తగ్గించారని, వారిని చూసి తాము కూడా తగ్గించేది లేదని, సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన వుందని" తలసాని వారికి భరోసా ఇచ్చారు.
Also Read : 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ ఆ రోజున రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారా?
టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల విషయం ప్రభుత్వ పరిశీలనలో వుందని మంత్రి తెలిపారు. ప్రొడ్యూసర్లు ఇబ్బందులు పడొద్దని, అపోహలు నమ్మొద్దని తలసాని పేర్కొన్నారు. థియేటర్ల మూసివేత, 50 శాతం ప్రేక్షకులు అని చెప్పడం అవాస్తవమని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలని.. కరోనా వల్ల రెండేళ్లుగా సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోందని మంత్రి అన్నారు. "అఖండ" విడుదలైన తర్వాత థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య కాస్త పెరిగిందని తలసాని సంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: సూపర్ స్టార్ మోకాలికి సర్జరీ.. రెండు నెలలు ఇంట్లోనే..
త్వరలోనే పుష్ప, భీమ్లా నాయక్, ఆచార్య లాంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నాయి. థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి సమయంలో దర్శక-నిర్మాతలు అప్రమత్తంగా ఉండాలి. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్ వస్తోందని.. అప్రమత్తంగా ఉండాలని దర్శక నిర్మాతలకు తలసాని సూచించారు.
Also Read: టికెట్ రేట్లపై ఏపీ సర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంటర్!?
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ 2 డోసులు దాదాపు పూర్తి అయ్యిందని మంత్రి చెప్పారు. సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయని.. గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించామని , సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా వుంటుందని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంత్రితో భేటీ అయిన వారిలో నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, చినబాబు, యేర్నేని నవీన్, ప్రమోద్, అభిషేక్ నామా దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ తదితరులు ఉన్నారు. ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోయినా తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇవ్వడంతో వారంతా సంతృప్తి చెందారు.
Also Read: ‘పుష్ప’ హిందీ రిలీజ్ తేదీ ఖరారు.. ఆ రోజు తగ్గేదేలే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి