RRR Trailer Release Date : 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ ఆ రోజే
'సిరివెన్నెల' సీతారామశాస్త్రి మరణించడంతో డిసెంబర్ 3 (శుక్రవారం) విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

'సిరివెన్నెల' సీతారామశాస్త్రి మరణంతో 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' ట్రైలర్ విడుదలను వాయిదా వేశారు. లేదంటే ఈ రోజు (డిసెంబర్ 3న) ప్రేక్షకులు అందరూ ట్రైలర్ చూసి ఉండేవారు. ఇప్పుడు కొత్త ట్రైలర్ విడుదలకు కొత్త డేట్ ఫైనలైజ్ చేసే పనిలో దర్శక ధీరుడు రాజమౌళి అండ్ టీమ్ బిజీగా ఉంది. అయితే వచ్చే గురువారం (డిసెంబర్ 9)... థియేటర్లలో ట్రైలర్ విడుదల చేయనున్నట్టు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తొమ్మిదిన ట్రైలర్ విడుదల చేస్తే... పదో తారీఖు నుంచి విడుదల అయ్యే కొత్త సినిమాలతో పాటు ట్రైలర్‌ను యాడ్ చేసే అవకాశం ఉంది. అలాగే, తొమ్మిదిన థియేటర్లలో ప్రదర్శితం అవుతున్న సినిమాల మధ్యలోనూ ట్రైలర్ ప్రదర్శిస్తారు. తొలుత ముంబైలో ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఆ ప్లాన్ పక్కన పెట్టినట్టు ఉన్నారు.
కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్'లో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రే స్టీవెన్ సన్, అలీసన్ డూడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ జోడీగా ఆలీయా భట్ నటించారు. ఆల్రెడీ విడుదలైన 'నాటు నాటు' పాటలో హీరోలు ఇద్దరు వేసిన స్టెప్పులకు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. 'జనని...' సాంగ్ సినిమాలో ఎమోషన్ ఎలివేట్ చేసింది. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత.
View this post on Instagram
Also Read: టాలీవుడ్‌కు బాలకృష్ణ భరోసా... 'అఖండ'తో అది తప్పని!
Also Read: సూపర్ స్టార్ మోకాలికి సర్జరీ.. రెండు నెలలు ఇంట్లోనే..
Also Read: 'మరక్కార్' రివ్యూ: మనకు తెలియని యోధుడు... తెలిసిన సినిమా!
Also Read: టికెట్ రేట్లపై ఏపీ సర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంటర్!?
Also Read: తల్లితో సమంత వాట్సాప్ చాట్... ఆ ఆత్మవిశ్వాసానికి సలామ్ కొట్టాల్సిందే
Also Read: ‘పుష్ప’ హిందీ రిలీజ్ తేదీ ఖరారు.. ఆ రోజు తగ్గేదేలే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

