IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK
IPL, 2022 | Match 69 | Wankhede Stadium, Mumbai - 21 May, 07:30 pm IST
(Match Yet To Begin)
MI
MI
VS
DC
DC

Akhanda: టాలీవుడ్‌కు బాలకృష్ణ భరోసా... 'అఖండ'తో అది తప్పని!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ భరోసా ఇచ్చారు. 'అఖండ'తో అందరిలో ఓ ఆశ కల్పించారు. ఎవరేం తీశారు? అనేది ఇండస్ట్రీ ఫ్యూచర్ డిసైడ్ చేయనుంది.

FOLLOW US: 

'అఖండ' విడుదల తర్వాత హీరో నాని 'బాలకృష్ణగారు గేట్స్ ఓపెన్ చేశారు' అని ట్వీట్ చేశారు. దీని వెనుక చాలా అర్థం ఉంది! అదేంటంటే... టాలీవుడ్‌కు నట సింహ నందమూరి బాలకృష్ణ ఇచ్చిన భరోసా. తెలుగు హీరోలు మీనమేషాలు లెక్కిస్తున్న సమయంలో బాలకృష్ణ ధైర్యంగా ముందడుగు వేశారు. లేటెస్ట్ 'అఖండ' సినిమా విడుదలతో ఇండస్ట్రీలో నెలకొన్న భయాలను పోగొట్టారు. ఎలా అంటారా? కరోనా రెండో దశ తర్వాత లాక్‌డౌన్ తొల‌గించినా... థియేటర్లు వెంటనే ఓపెన్ కాలేదు. అప్పట్లో ఏపీలో మూడు షోలు ఉండటం... ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా? అనే సందేహాల నడుమ సినిమాలు విడుదల చేయడానికి కొంత ఆలోచించారు. కొన్ని రోజులు వేచి చూశారు.

ఏపీలో మూడు షోలు ఉన్నా పర్వాలేదని కొందరు సినిమాలు విడుదల చేశారు. అప్పట్లో వచ్చిన లో బడ్జెట్ సినిమాలు కొన్ని మంచి టాక్ తెచ్చుకున్నాయి. 'లవ్ స్టోరీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌' వచ్చాయి. అవి ఫ్యామిలీ డ్రామాలు. ఆయా సినిమాలతో పోలిస్తే... త్వరలో విడుదలకు రెడీగా ఉన్నవి భారీ బడ్జెట్ సినిమాలు. 'లవ్ స్టోరీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌' సినిమాలతో పోలిస్తే... భారీ ఓపెనింగ్స్ రావాలి. వస్తాయా? లేవా? ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? రారా? అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందువల్లే, 'ఆర్ఆర్ఆర్' కూడా వాయిదా పడింది. ఈ తరుణంలో ఏ పెద్ద సినిమా విడుదల అవుతుంది? ఇండస్ట్రీలో భయాలకు ఎవరు బదులు ఇస్తారు? అని ఎదురు చూశారు. అన్నిటికీ బాలకృష్ణ సమాధానం ఇచ్చారు. 'అఖండ'కు వస్తున్న స్పందన సమాధానం ఇచ్చింది.

'అఖండ' పక్కా మాస్ మసాలా కమర్షియల్ సినిమా. కరోనాలో ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారని, కాలం చెల్లిన కథలతో సినిమాలు తీస్తే ఎవరూ చూడరనే కామెంట్లు ఆ మధ్య వినిపించాయి. అయితే... తెలుగు ప్రేక్షకులు కమర్షియల్ సినిమాలకు అభిమానులు అని 'అఖండ' సినిమా మరోసారి నిరూపించింది. ఫస్ట్ డే 'అఖండ'ను చూడటానికి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను చూసి ఇండస్ట్రీ జనాలు కూడా చాలా సంతోషించారు. అందువల్ల, పాజిటివ్ రిపోర్ట్స్ చూసి మహేష్ బాబు, ఎన్టీఆర్ తదితర హీరోలు మొదలుకుని ఇండస్ట్రీలో చిన్న హీరోల వరకూ 'అఖండ' ఆదరణపై ట్వీట్లు వేశారు. ఇప్పుడు ఇండస్ట్రీకి ఓ ధైర్యం వచ్చింది. హ్యాపీగా భారీ సినిమాలు విడుదల చేసుకోవచ్చని అందరూ అనుకుంటున్నారు.
Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
'అఖండ' తర్వాత ఈ నెల 17న 'పుష్ప' విడుదల అవుతోంది. ఆ తర్వాత 24న నాని 'శ్యామ్ సింగ రాయ్' వస్తుంది. జనవరిలో 7న 'ఆర్ఆర్ఆర్', 12న 'భీమ్లా నాయక్', 14న 'రాధే శ్యామ్' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాలు అన్నిటికీ భారీ ఓపెనింగ్స్ వస్తాయని 'అఖండ'లు లభిస్తోన్న ఆదరణతో స్పష్టం అయ్యింది. ఆ తర్వాత ఎంత కలెక్ట్ చేస్తాయనేది ఆ సినిమాల్లో కంటెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది.

Also Read: 'మరక్కార్' రివ్యూ: మనకు తెలియని యోధుడు... తెలిసిన సినిమా!
Also Read: సూపర్ స్టార్ మోకాలికి సర్జరీ.. రెండు నెలలు ఇంట్లోనే..
Also Read: తల్లితో సమంత వాట్సాప్ చాట్... ఆ ఆత్మవిశ్వాసానికి సలామ్ కొట్టాల్సిందే
Also Read: టికెట్ రేట్లపై ఏపీ స‌ర్కార్‌కు హీరో సిద్ధార్థ్ కౌంట‌ర్‌!?
Also Read: ‘పుష్ప’ హిందీ రిలీజ్ తేదీ ఖరారు.. ఆ రోజు తగ్గేదేలే!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 03 Dec 2021 05:24 PM (IST) Tags: ntr Mahesh Babu Tollywood Akhanda nani Balakrishna Akhanda Movie NBK

సంబంధిత కథనాలు

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?

NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?

NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?

NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్

NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Name Change: అట్టుడుకుతున్న కోనసీమ, జిల్లా పేరు మార్చవద్దని ఆందోళన ఉధృతం - పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మాహత్యాయత్నం

Konaseema Name Change: అట్టుడుకుతున్న కోనసీమ, జిల్లా పేరు మార్చవద్దని ఆందోళన ఉధృతం - పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మాహత్యాయత్నం

Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !

Afghan Taliban Rules :  టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !

Allegations On Jeevita : జీవిత ప్రమాదకరమైన లేడీ - డబ్బులు ఎగ్గొట్టి ఆరోపణలు చేస్తున్నారన్న గరుడవేగ నిర్మాతలు !

Allegations On Jeevita 	:  జీవిత ప్రమాదకరమైన లేడీ - డబ్బులు ఎగ్గొట్టి ఆరోపణలు చేస్తున్నారన్న గరుడవేగ నిర్మాతలు !

Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం