Pushpa Release Date: ‘పుష్ప’ హిందీ రిలీజ్ తేదీ ఖరారు.. ఆ రోజు తగ్గేదేలే!
ఎట్టకేలకు ‘పుష్ప’ హిందీలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ శుక్రవారం విడుదల తేదీని ప్రకటించింది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ హిందీ రిలీజ్‌పై సందేహాలకు తెరపడింది. రిలీజ్ విషయంలో ‘తగ్గేదేలే’ అంటూ శుక్రవారం తాజా కబురు చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను అన్ని భాషలతో కలిపి.. హిందీ ‘పుష్ప’ను విడుదల చేస్తామంటూ తేదిని ప్రకటించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
‘అల.. వైకుంఠపురములో’ సినిమా తర్వాత బన్నీకి జాతీయ స్థాయిలో క్రేజ్ లభించింది. ఈ సినిమా కంటే ముందే బన్నీ చిత్రాలను వివిధ టీవీ చానెళ్లు.. అనువాదించి ప్రసారం చేయడంతో.. ఇప్పుడు బన్నీ అందరికీ సుపరిచితమయ్యాడు. అలాగే.. కేరళ, కర్ణాటకలో కూడా బన్నీకి మాంచి క్రేజ్ ఉంది. అయితే, తమిళనాడులో అల్లువారి అబ్బాయిని ఎలా ఆధరిస్తారనేది చూడాల్సి ఉంది. పైగా ఈ చిత్రం కథలో తమిళనాడు నేపథ్యం కూడా ఉంటుందనేది టాక్.
గత కొన్ని రోజులుగా ఈ సినిమా హిందీ రిలీజ్ కు సమస్య వచ్చినట్లుగా వార్తలొచ్చాయి. మైత్రి మూవీస్ సంస్థ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను అలవాటు ప్రకారం.. ఓ బయ్యర్ కు అమ్మేశారు. ఆ తరువాత పాన్ ఇండియా రిలీజ్ అనుకోవడంతో అసలు సమస్య మొదలైంది. హిందీ డబ్బింగ్ రైట్స్ కొనుకున్న వ్యక్తి థియేట్రికల్ రిలీజ్‌కు అంగీకరించ లేదు. దీంతో మైత్రి అధినేతలు హిందీ డబ్బింగ్ హక్కులు కొనుక్కున్న వ్యక్తితో చర్చించారు. అయితే బయ్యర్ ‘తగ్గేదేలే’ అంటూ కూర్చోవడంతో.. యూట్యూబ్‌లో రిలీజ్ అవుతుందనే టాక్ వచ్చింది. ఇది బన్నీ ఫ్యాన్స్‌కు ఆగ్రహాన్ని కలిగించింది.
Also Read: ‘అఖండ’ కలెక్షన్లు.. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల సునామీ.. కానీ, ఏపీలోనే..
హిందీ వెర్షన్ కూడా థియేటర్లో విడుదల చేయాల్సిందే అంటూ ట్విట్టర్ లో రచ్చ చేశారు. వారి కోరిక ప్రకారమే.. ‘పుష్ప’ హిందీ వెర్షన్ థియేటర్లోనే రిలీజ్ అవుతుంది. అనిల్ తడాని, గోల్డ్ మైన్ ఫిలిమ్స్ సంస్థ ‘పుష్ప’ హిందీ హక్కులను దక్కించుకున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా గోల్డ్ మైన్ ఫిలిమ్స్ వాళ్లతో చర్చల్లో పాల్గొని డీల్‌ను క్లోజో చేశారని తెలిసింది. హిందీ వెర్షన్‌కు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పూర్తైంది. దీంతో మిగతా భాషలతో కలిపి హిందీ ‘పుష్ప’ కూడా డిసెంబరు 17న రిలీజ్ కానుంది.
Also Read: కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!
Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...
Also Read: సెట్స్‌కు వచ్చిన మెగాస్టార్... నెర్వస్‌లో డైరెక్టర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి