Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...
ఎవండోయ్.. మీకు ఇది తెలుసా? ‘ఒమిక్రాన్’ అనేది వైరస్ కాదంట. 1963లో విడుదలైన చిత్రమట. మరి, వైరస్‌కు ఆ పేరు ఎందుకు పెట్టారు?
Omicron.. ఇప్పుడు ప్రపంచమంతా ఈ పేరునే కలవరిస్తోంది. ఎందుకంటే.. Covid-19 నుంచి పుట్టిన కొత్త వైరస్. ఇండియాలో మారణకాండ సృష్టించిన డెల్టా వేరియెంట్ కంటే ప్రమాదకరమైన ఈ వైరస్ ఇప్పటికే వివిధ దేశాల్లో తన ఉనికిని చాటుతోంది. తాజాగా ఇండియాలోకి కూడా ప్రవేశించిన ఈ మహమ్మారి మరోసారి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. అయితే, ఇది వేరియెంట్ ప్రమాదకరమైనదని కొందరు, అంత ప్రమాదకరమైనది కాదని మరికొందరు గందరగోళానికి గురిచేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాత్రం ఈ వేరియెంట్‌ను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరిస్తోంది. డెల్టా వేరియెంట్ తరహాలోనే ఇది ముప్పుతిప్పలు పెడుతుందని, దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
‘ఒమిక్రాన్’ అంటే గ్రీకు సంఖ్య 15ను సూచిస్తుంది. ఇప్పటి వరకు వివిధ దేశాల్లో కనుగొన్న కరోనా వేరియెంట్లలో ‘ఒమిక్రాన్’ వైరస్‌లలో13వ వేరియెంట్. అయితే, ఈ సంఖ్యతో సంబంధం లేకున్నా.. WHO సూచన ప్రకారం ఈ వేరియెంట్‌కు ‘ఒమిక్రాన్’ అనే పేరును ఖరారు చేశారు. కరోనా వేరియెంట్ల పేర్లను దేశాల పేర్లతో పిలవడం మంచిది కాదనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్‌ఓ సంస్థ ఒక్కో వేరియెంట్‌కు ఒక్కో పేరు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దక్షిణాఫ్రికా వేరియెంట్‌కు ‘ఒమిక్రాన్’ పేరు పెట్టారు. అయితే, ఒమిక్రాన్ అనేది గ్రీకు పదమే. కానీ, 1963లోనే ఈ పదాన్ని వాడేశారు. అయితే, వైరస్‌కు కాదు.. ఓ సినిమాకు.
‘ఒమిక్రాన్’ అనేది సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ చిత్రానికి, వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ, ఇది కూడా మానవాళికి ఏర్పడే ఉపద్రవం గురించి తీసిన చిత్రమే. నిర్మాత, రచయిత యుఫో గ్రెగోరెట్టి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఎలియన్స్ (గ్రహాంతరవాసులు) భూమి గురించి తెలుసుకొని, దాడి చేయడం కోసం ఓ వ్యక్తిని ఎత్తుకెళ్లిపోతాయి. ఈ చిత్రం అప్పట్లో వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా నామినేట్ అయ్యింది.
What's going on yaar , does the virus stealing the name of the movies pic.twitter.com/vt0mkVMFhP
— Khalid A Sarkawas (@SarkawasA) November 29, 2021
2013 సంవత్సరంలో కూడా ‘ది విజిటర్ ఫ్రమ్ ప్లానెట్ ఒమిక్రాన్’ అనే సినిమా విడుదలైంది. ఇది కూడా గ్రహాంతరవాసుల చిత్రమే. ఇది ఓ గ్రహం నుంచి భూమి మీదకు వచ్చే ఎలియన్ కథ. అయితే, అరిజోనాలో ఓ వితంతువు తన వంటలతో ఆ గ్రహాంతరవాసిని మెప్పిస్తుంది.
There’s also a 2013 movie called “The Visitor from Planet Omicron,” which centers around an alien who comes to Earth. But an Arizona widow wins the alien over with her cooking abilities https://t.co/JgjOiu3EFe pic.twitter.com/StqTYonI3k
— @SilentAsThunder🌪 (@IYellAlot17) December 2, 2021
ఇది కాకుండా క్రిస్ మిల్లర్, లార్డ్ మిల్లర్ అనే దర్శకులు.. ‘ఒమిక్రాన్’ వేరియెంట్ అనే చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. ఈ సందర్భంగా పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే, ఆ చిత్రం మాత్రం విడుదల కాలేదు. తాజాగా వాణిజ్య దిగ్గజం ఆనంద్ మహీంద్ర కూడా ‘ఒమిక్రాన్’ ఓ సినిమా అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఆ వివరాలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
And after my last tweet, a school buddy sent me this nugget of trivia—someone already beat me to writing a script titled Omicron 😊 https://t.co/6PMcLrHC57 pic.twitter.com/m0Pnktxt98
— anand mahindra (@anandmahindra) November 30, 2021
Also Read: ఓమ్రికాన్ వేరియంట్ వేళ...ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లకే హై రిస్క్, చెబుతున్న ఇండియన్ అధ్యయనం
Also Read: ఓ మై క్రాన్.. కొత్త కోవిడ్ సోకితే లక్షణాలు కనిపించవా? దక్షిణాఫ్రికా డాక్టర్ చెప్పిన కీలక విషయాలివే..