Shruti Haasan: నాలుగు గంటలు నరకయాతన... ఇండిగోపై నిప్పులు చెరిగిన శృతి హాసన్
ఇండిగో విమాన సంస్థపై నటి శృతి హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాచారం లేకుండా విమానం నాలుగు గంటలు ఆలస్యం కావడంపై అసహనాన్ని వెళ్లగక్కింది.
Actress Shruti Haasan slams IndiGo: తాను వెళ్లాల్సిన విమానం నాలుగు గంటలు ఆలస్యం కావడంపై నటి శృతి హాసన్ సీరియస్ అయ్యింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమను ఎయిర్ పోర్టులో కూర్చోబెట్టారంటూ మండిపడింది. తనతో పాటు పదుల సంఖ్యలో ప్రయాణీకులు ఎయిర్ పోర్టులో పడిగాపులు కాయాల్సి వచ్చిందని వెల్లడించింది. శృతి హాసన్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టుకు ఇండిగో సంస్థ స్పందించింది. ఆలస్యానికి క్షమించాలని కోరింది.
ఇండిగో విమానం నాలుగు గంటలు ఆలస్యం
ఇండిగో సంస్థ నిర్లక్ష్యంపై చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. విమాన సిబ్బంది వ్యవహరించే తీరు, లగేజీని అడ్డగోలుగా విసిరి వేయడం లాంటి ఘటనలపై గతంలో పలువురు సినీ తారలు తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేశారు. తాజాగా శృతి హాసన్ ఈ లిస్టులో చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా తాను వెళ్లాల్సిన విమానం ఏకంగా 4 గంటలు ఆసల్యం కావడంపై అసహనం వ్యక్తం చేసింది. తన తోటి ప్రయాణీకలకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండి పడింది. ఇండిగో సంస్థ నిర్లక్ష్యాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టింది. “నేను సాధారణంగా ఎవరి మీద కంప్లైంట్ చేయను. కానీ, ఇండిగో సంస్థ తీరు చాలా నిర్లక్ష్యంగా ఉంది. గత నాలుగు గంటలుగా ఎలాంటి సమాచారం మమ్మల్ని ఎయిర్ పోర్టులో వెయిట్ చేయిస్తున్నారు. సమస్య ఏమైనా ఉంటే ముందుగా చెప్తే బాగుటుంది” అని రాసుకొచ్చింది.
Hey I’m not one to normally complain but @IndiGo6E you guys really outdid yourself with the chaos today , we’ve been stranded in the airport with no information for the past four hours - maybe figure a better way for your passengers please ? Information , courtesy and clarity 🙏
— shruti haasan (@shrutihaasan) October 10, 2024
శృతి హాసన్ కు క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ
అటు శృతిహాసన్ ఇండిగో సంస్థ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సదరు విమానయాన సంస్థ స్పందించింది. ఆమెకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరింది. “మిస్ హాసన్, విమానం ఆలస్యం కారణంగా మీకు కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాము. వెయిటింగ్ ఎంత అసౌకర్యంగా ఉంటుందో మేం అర్థం చేసుకోగలం. ముంబైలోని వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం రాక ఆలస్యమైంది. అంతేతప్ప, మా వ్యక్తిగత నిర్లక్ష్యం ఏమీ లేదు” అని ఇండిగో సంస్థ వెల్లడించింది. శృతి మాత్రమే కాదు, గతంలో నటి దివ్య దత్తా సైతం ఇండిగో సంస్థ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా విమానాన్ని రద్దు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. “తన జీవితంలో ఇదో భయంకర అనుభవం” అంటూ సోషల్ మీడియా వేదిగా రాసుకొచ్చింది.
చివరగా ‘సలార్’ సినిమాలో కనిపించిన శృతి హాసన్
శృతి హాసన్ చివరగా ‘సలార్’ సినిమాలో కనిపించింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘సలార్ 2’తో పాటు ‘శౌర్యంగ పర్వం’, ‘చెన్నై స్టోరీ’ సినిమాల్లో నటిస్తున్నది. అటు అడవి శేష్ తో కలిసి మరో సినిమాలోనూ ఆమె నటిస్తున్నది.
Also Read: 'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?