కమల్ హాసన్ నవంబర్ 7, 1965లో మద్రాస్‌లో జన్మించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికరమైన విశేషాలు... కమల్ హాసన్ అసలు పార్థసారథి శ్రీనివాసన్. ఆయన తండ్రి న్యాయవాది. తల్లి గృహిణి. నాలుగేళ్ల వయసులో 'కళతర్ కణ్ణమ్మ'తో కమల్ తెరంగేట్రం చేశారు. ఆ సినిమాకు ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు. తనకప్పన్ దగ్గర సహాయకుడిగా పని చేశారు. 'అన్నై వెలంకాని', 'కాశి యాతిరై'లో డ్యాన్సర్‌గా కనిపించారు. ఆరు దశాబ్దాల నట జీవితంలో కమల్ మూడు జాతీయ అవార్డులు మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. హయ్యస్ట్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (19) అందుకున్న రికార్డ్ ఆయనదే. 'సాగర్'కు బెస్ట్ యాక్టర్, సపోర్టింగ్ యాకర్ అవార్డులు వచ్చాయి. ఫిల్మ్‌ఫేర్ జ్యూరీకి 2000లో తనను 'బెస్ట్ యాక్టర్'గా నామినేట్ చేయవద్దని కమల్ లెటర్ రాశారు. భారతీయ సినిమాకు చేసిన సేవకు గాను కమల్ ఫ్రెంచ్ ప్రభుత్వం 'Ordre des Arts et des Lettres'తో సత్కరించింది. తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ - ఆరు భాషల్లో సినిమాలు చేశారు. ఐదు భాషల్లో సిల్వర్ జూబ్లీలు ఉన్నాయి. 63 ఏళ్ళ వయసులో కమల్ హాసన్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 'మక్కల్ నీది మయ్యం' పార్టీ స్థాపించారు.