బుల్లితెర రాములమ్మ శ్రీముఖిని ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చూశారా? రాములమ్మ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి మోడ్రన్ మహిళగా ప్రేక్షకులకు గుర్తు ఉండాలని శ్రీముఖి కోరుకుంటున్నట్టు ఉన్నారు. ఆహా ఓటీటీలో వచ్చే డ్యాన్స్ రియాలిటీ షో 'డాన్స్ ఐకాన్'లో కో ఓనర్‌గా అడుగు పెట్టినప్పటి నుంచి ఆవిడ డ్రసింగ్ స్టైల్ మారింది. శ్రీముఖి వార్డ్ రోబ్ లో ఇప్పుడు ఎక్కువ మోడ్రన్ డ్రస్ లు కనిపిస్తున్నాయి. స్టైలిష్ డ్రస్ లకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బ్లాక్ స్కర్టులో లేటెస్ట్ శ్రీముఖి దిగిన లేటెస్ట్ ఫోటోలు ఇవి. డాన్స్ ఐకాన్ కోసం ఆమె ఇలా రెడీ అయ్యారు. 'డాన్స్ ఐకాన్' కారణంగా ఆవిడను కొత్తగా చూసే ఛాన్స్ లభిస్తోందని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పెళ్లి కాని టీవీ సెలబ్రిటీల జాబితాలో శ్రీముఖి పేరు కూడా ఉంటుంది. ఇంకో రెండేళ్ల తర్వాత ఆమె పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. తనకు భర్తగా సెన్సిబుల్ పర్సన్ రావాలని వెయిట్ చేస్తున్నట్టు గతంలో ఒకసారి శ్రీముఖి పేర్కొన్నారు. 'డాన్స్ ఐకాన్' కాకుండా ఈటీవీలో వచ్చే 'మిస్టర్ అండ్ మిస్సెస్' షోకి శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్నారు. శ్రీముఖి (All Images Courtesy : sreemukhi / Instagram)