‘కాంతార’ సినిమాతో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది సప్తమి గౌడ.

రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్ మూవీలో ఫారెస్ట్ గార్డ్ గా నటించి మెప్పించింది.

సప్తమి ఇప్పటి వరకు 2 సినిమాలే చేసినా మంచి పాపులారిటీ సంపాదించింది.

సినిమాల్లోకి రాకముందు జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ఎన్నో పతకాలు సాధించింది.

5 ఏండ్ల వయసు నుంచే స్మిమ్మర్ గా ప్రయాణం మొదలుపెట్టింది.

ఆమె తండ్రి, పోలీస్ అధికారి S.K. ఉమేష్ తనను వాటర్ స్పోర్ట్స్ వైపు తిప్పాడు.

9 సంవత్సరాల వయస్సు నుంచి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్నది.

9వ ఏట మంగళూరులో జరిగిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ ఈవెంట్‌లో తొలి బంగారు పతకాన్ని గెలుచుకుంది.

ఆ తర్వాత పలు జాతీయ స్థాయి స్విమ్మింగ్ ఈవెంట్స్ లో పాల్గొని ఎన్నో పతకాలు సంపాదించింది.

Photos Credit: Sapthami Gowda/Instagram