మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఆయన భార్య ఉపాసన ఆఫ్రికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. టాంజానియాలో వైల్డ్ లైఫ్ ను చూస్తూ సరదాగా గడుపుతున్నారు. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల ఆటలను తిలకిస్తూ ఆనందిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్‘ ప్రమోషన్స్ లో భాగంగా చెర్రీ దంపతులు జపాన్ వెళ్లారు. జూ. ఎన్టీఆర్, రాజమౌళితో కలిసి చరణ్ ‘ఆర్ఆర్ఆర్‘ ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత రాం చరణ్, ఉపాసన ఆఫ్రికా వెకేషన్ కు వెళ్లారు. తాజాగా ఆఫ్రికా పర్యటనకు సంబంధించిన వీడియోను ఉపాసన నెట్టింట్లో పెట్టింది. Photos & Video Credit: Upasana Kamineni Konidela/ Instagram