తనకు మాయోసైటిస్ వ్యాధి ఉందని సమంత చెప్పారు. ఆమెకు ముందు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న హీరోయిన్లు చూడండి. నయనతార చర్మ చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడ్డారు. మేకప్ వల్ల స్కిన్ పాడైంది. శృతి హాసన్‌కు పీసీఓడి ఉంది. అందువల్ల, ఆ మధ్య బరువు పెరిగానని చెప్పారు. నటి పునర్నవి భూపాలం కూడా పీసీఓడి సమస్యతో సతమతం అయ్యారు. హంసా నందినికి క్యాన్సర్. సోనాలి బింద్రే, మనీషా కొయిరాలా, లీసా రేతో పాటు కొందరు క్యాన్సర్ బారిన పడ్డారు. ఇలియానాకు బాడీ డిస్పోర్ఫిక్ డిజార్డర్ ఉంది. తాను అందంగా లేనని ఇన్ సెక్యూరిటీకి లోనయ్యారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ డిప్రెషన్‌కు లోను కావడం వల్ల తీవ్ర మానసిక సమస్యలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. కపూర్ ఖాందాన్ కుమార్తె సోనమ్ కు డయాబెటిస్ ఉంది. ఫిర్నిషియస్ అనీమియా అనే రక్తహీనత వ్యాధి బారిన పడ్డారు స్నేహా ఉల్లాల్ ప్రియాంకా చోప్రా కజిన్, హిందీ హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా డిప్రెషన్‌కు లోనై సమస్యలు పడ్డారట. కొన్నేళ్ల క్రితం తాను యాంగ్జైటీకి లోనయ్యానని అనుష్కా శర్మ పేర్కొన్నారు.