ఈఫిల్ టవర్ సాక్షిగా హన్సికకు పెళ్లి ప్రపోజ్ హన్సిక తన కాబోయే వరుడిని పరిచయం చేసింది. సోషల్ మీడియాలో అఫీషియల్‌గా పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. తన బిజినెస్ పార్టనర్ సోహైల్‌తో డేటింగ్‌లో ఉంది. అతడు తనకు ప్రపోజ్ చేసిన ఫోటోలను ఇన్ స్టాలో పోస్టు చేసింది. సోహైల్ హన్సికకు వేలికి ఉంగరం తొడిగి ‘మ్యారీ మీ’ అని అడిగాడు. వీరి పెళ్లి డిసెంబర్ 4న రాజస్థాన్లోని జైపూర్‌లో జరగనుందని సమాచారం. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు చేయడం మొదలైపోయింది. (All Images credit: Hansika/Instagram)