శోభా శెట్టి పేరు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మోనితగా ముద్ర పడింది. 'కార్తీక దీపం' సీరియల్ ఎఫెక్ట్ అలాంటిది మరి! 'కార్తీక దీపం'లో డాక్టర్ మోనితగా గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్న శోభా శెట్టి, రియల్ లైఫ్‌లో అందంగా ఉంటారు. మోనిత నవ్వుకు, ఆమె మాట తీరుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. లేటెస్టుగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోలివి. పచ్చరంగు కోకలో శోభా శెట్టి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగులో 'కార్తీక దీపం' కంటే ముందు 'అష్టా చమ్మా' సీరియల్ చేశారు. అయితే... 'కార్తీక దీపం'లో మోనిత పాత్ర ఆమెకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది. అప్పుడప్పుడూ 'జీ తెలుగు'లో వచ్చే రియాలిటీ షోస్ లో శోభా శెట్టి సందడి చేస్తున్నారు. 'సూపర్ క్వీన్' రియాలిటీ షో శోభా శెట్టిని తెలుగు ప్రజలకు మరింత దగ్గర చేసింది. ఇటీవల 'లేడీస్ అండ్ జెంటిల్‌మన్' షోలో కూడా శోభా శెట్టి సందడి చేశారు. 'కార్తీక దీపం'లో మోనిత అలియాస్ శోభా శెట్టి (All Images courtesy - @Shobha Shetty/Instagram)