సుమ కనకాల స్టార్ యాంకర్. 'క్యాష్' ప్రోగ్రాంతో టీవీలో, మెజారిటీ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఆవిడ కనిపిస్తారు. సుమ కనకాల రెండు చేతులా సంపాదిస్తున్నారని అందరూ అనుకుంటారు. కానీ, ఆవిడ చెప్పేది వేరుగా ఉంది. ''పాస్ట్, ఫ్యూచర్ ఏమీ ఉండదు. కేవలం ప్రజెంట్ మాత్రమే ఉంటుంది'' అని నేను కొన్నిసార్లు ఆలోచిస్తాని సుమ తెలిపారు. అలా ఆలోచించిన కాసేపటికి ఆవిడ ఈఎంఐ కట్టాల్సి ఉందని గుర్తుకు వస్తుందట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే... సుమకు కూడా ఈఎంఐ కష్టాలు ఉన్నాయని! సుమ ఫోటోలకు ఇచ్చిన క్యాప్షన్ కంటే ఆవిడను ఎక్కువ మంది చూస్తున్నారు. డ్రస్ బావుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు సుమ కనకాల (All Images, Video Courtesy : Suma Kanakala / Instagram) లేటెస్ట్ సోషల్ మీడియా ట్రెండ్ ట్రై చేసి ఫెయిల్ అయ్యాయని సుమ తెలిపారు.