‘జాతిరత్నాలు’ సినిమాతో ఫరియా అబ్దుల్లా తెలుగు తెరకు హీరోయిన్ పరిచయం అయ్యింది. తొలి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘లైక్, షేర్, సబ్‌స్క్రైబ్’ సినిమాతో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. సంతోష్ శోభన్‌తో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నది. నవంబర్ 4న ఈ మూవీ రిలీజ్ కానుంది. నాగార్జున ‘బంగార్రాజు’ మూవీలో స్పెషల్ సాంగ్‌తో అదుర్స్ అనిపించింది. ఓ రేంజిలో అందాలను ఆరబోసి ఆశ్చర్య పరిచింది. అందాల తార సినిమాల్లో బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంది. తాజాగా సముద్రపు అలల్లో షూటింగ్ కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. Photos & Video Credit: Faria Abdullah/Instagram/twitter