టీవీ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్లో రిషికి తల్లి గా నటిస్తున్న జగతి హీరోయిన్ లా ఉందంటూ అందరి మన్ననలు పొందుతోంది ‘కార్తీకదీపం‘లో సౌందర్య పాత్ర తర్వాత అందంగా, హుందాగా ఉండే పాత్ర ‘గుప్పెడంత మనసు‘ జగతిది. అందం, అభినయంతో మెప్పిస్తోన్న జగతి అసలు పేరు జ్యోతి రాయ్. జ్యోతి రాయ్ 1987 జూలై 4వ తేదీన కర్ణాటకలో జన్మించింది. విద్యాభ్యాసం పుట్టూరులోనే కొనసాగింది. 'గుప్పెడంత మనసు' సీరియల్ కన్నా ముందు నిరుపమ్ హీరోగా నటించిన ‘కన్యాదానం'లో నటించింది. చాలా కాలం తర్వాత 'గుప్పెడంత మనసు' సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఉన్న శ్రద్ధ జ్యోతిని నటన వైపు అడుగేసేలా చేసింది. పలు కన్నడ సీరియల్స్, సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నది. జ్యోతి రాయ్ కి పెళ్లైంది. ఓ బాబు ఉన్నాడు. Photos Credit: Jyothi Rai/Instagram